ప్రస్తుతం వేసవి కాలం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.ఏప్రిల్‌లోనే ఎండలు మంట పుట్టిస్తే.
మే నెల వచ్చే సరికి మరింత ముదిరిపోయాయి.దీంతో ఉదయం పది గంటలు దాటిందంటే చాలు ప్రజలు బయటకు రావాలంటేనే జంక్కుతున్నారు.
మరోవైపు వాతావరణ శాఖ సైతం ఎండల్లో తిరగవద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తోంది.అయితే వేసవిలో ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.
మరెన్నో ఆరోగ్య నియమాలను పాటించాలి.
అలాగే మసాలాలకు కూడా దూరంగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు.
వాస్తవానికి వంటలకు చక్కటి రుచిని అందించే మసాలాలు.ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
అలా అని ప్రస్తుత వేసవి కాలంలోనూ వాటిని విరి విరిగా వాడేస్తే తిప్పలు తప్పవు.అందులోనూ ఇప్పుడు చెప్పబోయే మూడు మసాలాలను ఈ సీజన్‌లో వీలైనంత వరకు తక్కువగా తీసుకోవాలి.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ మూడు మసాలాలు ఏంటో చూసేయండి.

ఘాటైన రుచి, వాసన కలిగి ఉండే నల్ల మిరియాలను సమ్మర్‌లో చాలా అంటే చాలా పరిమితంగా తీసుకోవాలి.లేదా వేసవి వెళ్లే వరకు పూర్తిగా అయినా మానేయాలి.శరీరంలో వేడిని పెంచే గుణం నల్ల మిరియాలకు ఉంది.
అందువల్ల, వీటిని తీసుకుంటే ఒంట్లో వేడి ఎక్కువై తలనొప్పి, కళ్లు తిరగడం, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఏర్పడతాయి.అలాగే దాల్చిన చెక్క ఆరోగ్యానికి మంచిదే అయినా వేసవిలో మాత్రం దీనిని తీసుకోవడం తగ్గించాలి.
లేదంటే నోట్లో పుండ్లు ఏర్పడతాయి.ఇక నిత్యం వంటల్లో వాడే మసాలా పసుపు.
దీనిలో బోలెడన్ని పోషకాలతో పాటు ఔషధ గుణాలు నిండి ఉంటాయి.అయితే వేసవి కాలంలో పసుపు చాలా మితంగా తీసుకోవాలి.
లేకుంటే తల తిరగడం, కడుపు నొప్పి, అతిసారం వంటి సమస్యలు మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెడతాయి.