జయలలిత( Jayalalithaa ) చెన్నైలో పుట్టి పెరిగిన ఒక అందమైన మరియు ఎంతో మృదుస్వభావురాలైన నటి.కానీ ఆమె రాటు తేలిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.
ఆమెలో ఒక ఆదిశక్తి లాంటి వ్యక్తి ఉన్నారని విషయం రాజకీయాల్లోకి వచ్చేంతవరకు కూడా ఆమెకు తెలియదు.చిన్నతనం నుంచి తండ్రి కూడా ఎవరో తెలియకుండా పెరిగి పెద్దయింది.
అవసరాల కోసం నటిగా మారింది, తను ఎంతో గొప్పగా చదవగలిగినప్పటికీ కూడా ఆమె తన తల్లి కోసం నటననే వృత్తిగా ఎంచుకుంది.హీరోయిన్ గా ఎదిగినప్పటికీ ఎంజీఆర్( Mgr ) లాంటి మహానుభావుడు దయవల్ల ఆమె పూర్తిగా ఒక వర్గం నటిమనిగా మిగిలిపోయింది.
ఆ తర్వాత ఆయన ద్వారానే రాజకీయాల్లోకి కూడా పరిచయమైంది.
కానీ ఎంజీఆర్ చనిపోయిన తర్వాతే ఆమెకు కఠిన పరీక్షలు ఎదురయ్యాయి.ఎంజీఆర్ స్థానంలో జానకమ్మ( Janakamma ) ముఖ్యమంత్రి గా పీఠం అధిరోహించి పార్టీని నడిపించలేక జయలలితను ఎదుర్కోలేక తన కూటమిని జయలలితకు అప్పగించి ఆమె శాశ్వతంగా రాజకీయాలనుంచి నిష్క్రమించింది.ఇదే ఆమె మొదటి గెలుపు ఒక్కసారిగా ఆమెకు పార్టీ పగ్గాలు అందగానే ఆమెలోని ఆదిశక్తి అవతారం ఏంటో ఆ పార్టీ నాయకులకు రుచి చూపించింది.
తను చెప్పినట్టే అందరూ వినాలి వినిపించుకోవాలి వినితీరాలి అంటూ కండిషన్ పెట్టగానే అందరూ నూరేళ్లపెట్టారు పార్టీ మొత్తం ఆమెకు వంగిసలాం చేశారు.ఇక ఆమె ఒక్కసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోగానే ముందుగా కరుణానిధి అంతు తెలిసింది ఆయనను వీల్ చైర్ పైనుంచి పక్కకు లాగి మెట్ల మించి ఈడ్చుకొచ్చి మరీ పోలీస్ స్టేషన్లో పడేయించింది.
అలాగే అసెంబ్లీలో ఆమె జుట్టు పట్టుకొని లాగిన కమిషనర్ దొరైని అసలు తమిళనాడులోని( Tamil Nadu ) లేకుండా చేసింది ఆయన జాడ కూడా ఆ తర్వాత ఎవరికీ తెలియలేదు.
ఇక జానకమ్మ వర్గంలో ఉంటూ జయలలితను బండ బూతులు తిట్టిన పీహెచ్ పాండియన్( PH Pandian ) అనే నాయకుడు ఆమెకు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాళ్లపై పడి నమస్కారం చేసిన ఫోటోలు మీడియా అంతా ప్రచారం చేయించింది.ఆడది పగబడితే ఎంతలా రాజ్యాలు నాశనం అవుతాయో చెప్పడానికి జయలలిత ఉదాహరణ చాలు ఇప్పటి తరం వారు అర్థం చేసుకోవడానికి ఆమె ఎన్నిసార్లు స్కాములు, ఆర్థిక నేరాలు చేశారని అరెస్టు చేసినా కూడా లొంగకుండా మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు.ఓడిన ప్రతిసారి అంతే వేగంగా ఎన్నికల్లో గెలుస్తూ వచ్చారు చివరికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తనువు చాలించారు.