ఏపీలో ఎట్టిపరిస్థితుల్లో రెండోసారి అధికారం దక్కించుకొని తీరాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు.ఆ దిశగానే ఎన్నో వ్యూహాలు.
మార్పులు అమలు చేస్తున్నారు.ఎమ్మెల్యేలకు, నేతలకు, కార్యకర్తలకు గట్టిగానే చెబుతున్నారు.
అవసరమైతే క్లాసులు తీసుకుంటున్నారు.సర్వేల్లో రిపోర్టు తేడాగా వస్తే సీట్లు కూడా కేటాయించమని చెబుతున్నారు.
అయితే ఎన్ని చేసినా ప్రజలు ఏమనుకుంటున్నారు.ప్రజా స్పందన ఎలా ఉందనేదానిపై ఫోకస్ పెట్టి ఇప్పటికే గడపగడపకూ మన ప్రభుత్వం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు.మంత్రులను, ఎమ్మెల్యేలను, పార్టీ ఇన్ చార్జులను రంగంలోకి దింపి వచ్చే ఎన్నికలకు సంబంధించి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని తాడేపల్లి నుంచి వినిపిస్తున్న మాట.
గడపగడపకూ మన ప్రభుత్వం అందుకేనా.?
అయితే గత ఎన్నికల్లో స్వయంగా తానే రంగంలోకి దిగి పాదయాత్ర చేశారు.దీంతో ప్రజలకు ఏం కావాలో.ఏం కోరుకుంటున్నారో గమనించారు.అయితే ప్రజల మనోభావాలు ఎప్పుడూ.ఒకే విధంగా ఉండవు.ఎప్పటికప్పుడు.
వారి కోరికలు.ఆశలు మారుతుంటాయి.
ఈ క్రమంలోనే ఇప్పుడు తన పాలన మూడేళ్లు గడిచిన తర్వాత కూడా ప్రజల ఆశలు నెరవేరలేదా? అనేసందేహం.సహజంగానే పాలకులకు రావాలి.
వస్తుంది.

అలా వచ్చినప్పుడే.చేస్తున్న పనుల్లో లోపాలను సరిదిద్దుకునేందుకు అవకాశం ఉంటుంది.ఇప్పుడు జగన్ కూడా అదే చేస్తున్నారు.
పైకి గడపగడప అంటూ చేస్తున్న యాత్రల్లో ప్రజల మనసును ఆయన కనిపెడుతున్నారని అంటున్నారు.దీని ప్రకారం వచ్చే ఎన్నికల్లో మార్పులు చేయాలని జగన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ఆ మార్పు ఎలా ఉంటుంది.? నేతలను మార్చడమా? లేక.విధి విధానాలను మార్చడమా.లేక.మేనిఫెస్టోను మార్చడమా.? అనే విషయాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.ఇప్పటికైతే పనిచేయని వారిని పక్కన పెడతామనే చెప్పారు.ఇక మిగిలిన మార్పులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.