ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు.పోలవరానికి జగనే శని అని విమర్శించారు.
అహంకారంతో పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారన్నారు.శనిపోతేనే పోలవరం కల సాకారం కాదని పేర్కొన్నారు.పోలవరానికి టీడీపీ హయాంలో రూ.4,114 కోట్లు ఖర్చు చేశామన్న చంద్రబాబు నిర్వాసితులకు వైసీపీ కేవలం రూ.1890 కోట్లే ఖర్చు చేసిందన్నారు.నిర్వాసితులకు ఎకరానికి రూ.19 లక్షలు ఇస్తామని మోసం చేశారని మండిపడ్డారు.కాంట్రాక్టర్ ను మార్చోద్దని పీపీఏ చెప్పినా జగన్ వినలేదన్నారు.టీడీపీ హయాంలో 45.72 మీటర్ల ఎత్తులో నిర్మించాలనుకుంటే జగన్ 41.15 మీటర్ల ఎత్తుతోనే సరిపెడుతున్నారని దుయ్యబట్టారు.