జబర్దస్త్ కార్యక్రమంలో లేడీ గెటప్స్ ద్వారా ఎంతో సందడి చేస్తున్నటువంటి వారిలో వినోద్ అలియాస్ వినోదిని ( Vinodini ) ఒకరు.ఈయన లేడీ గెటప్స్ వేస్తే ఆడవాళ్లు సైతం కుళ్ళుకొనేలా ఎంతో అందంగా కనిపిస్తారు.
జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమం ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వినోద్ తన నటనతో కామెడీ పంచలతో అందరిని నవ్విస్తూ ఉన్నప్పటికీ తెర వెనుక మాత్రం ఆయన జీవితంలో పెద్ద విషాదమే ఉందని చెప్పాలి.ఈయన తెరపై అందరిని నవ్వుతూ నవ్విస్తూ ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా మాత్రం ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలుస్తుంది.
ఇలా అనారోగ్య సమస్యలతో( Health Issues ) బాధపడుతున్నటువంటి వినోద్ పూర్తిగా జబర్దస్త్ కార్యక్రమానికి కూడా దూరంగా ఉంటున్నారు.అయితే ప్రస్తుతం ఈయన ఫోటోలు కనుక చూస్తే ఏమాత్రం గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు.అసలు ఇక్కడ ఉన్నది వినోదేనా అనే సందేహం ప్రతి ఒక్కరికి మరాకమానదు.అయితే ఈయన గత కొంతకాలంగా పలు రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.
అయితే తన అనారోగ్య సమస్యలు తెలుసుకుని పలువురు జబర్దస్త్ కమెడియన్స్ తనకు అండగా నిలిచి ఆర్థిక సహాయం చేశారని వినోద్ తెలిపారు.
ఇంటి గొడవ విషయంలో తాను చెయ్యి విరగొట్టుకున్నానని అలాగే ఒకరికి పూచి పడి ఐదు లక్షల వరకు నష్టపోయానని వినోద్ వెల్లడించారు.ఇలా తనని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడమే కాకుండా మరోవైపు అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టాయని ఈయన తన బాధను మొత్తం బయటపెట్టారు.తాను ఇలా ఇబ్బంది పడటానికి కారణం ఉందని తనపై ఎవరో చేతబడి చేశారనే సందేహాలు కూడా తనకు ఉన్నాయంటూ వినోద్ షాకింగ్ న్యూస్ వెల్లడించారు.
ఇలా తనపై చేతబడి చేశారన్న కారణం తోనే తాను వివిధ రకాల పరిహారపు పూజలు కూడా చేయించానని ఇందుకోసం కూడా దాదాపు మూడు లక్షల వరకు ఖర్చు అయింది అంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.