జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమంలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రాకింగ్ రాకేష్( Rocking Rakesh ) హీరోగా మారిన సంగతి మనకు తెలిసిందే.ఈయన హీరోగా కేసీఆర్ ( KCR ) అనే సినిమా ద్వారా తన సొంత నిర్మాణంలో తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.
ఇక ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులన్నిటిని పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ సినిమాకు ఊహించని షాక్ తగిలిందని చెప్పాలి.ఇలా రాకేష్ నటించిన ఈ సినిమా విడుదల చేయకూడదు అంటూ సెన్సార్ వాళ్ళు అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ సినిమా విడుదల ఆగిపోయింది.
కెసిఆర్ అనే టైటిల్ ద్వారా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలోనే ఈ సినిమా విడుదల వాయిదా పడిందని చెప్పాలి.ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల కోడ్ ( Election Code in Telangana )అమలులో ఉంది.ప్రజలను ప్రేరేపించే విధంగా ఎలాంటి రాజకీయ సినిమాలు కూడా విడుదల కావడానికి వీలు లేదు అంటూ ఎన్నికల కమిషన్ అలాగే సెన్సార్ వాళ్లు కూడా ఈ సినిమా విడుదలను అడ్డుకున్నారు.రాకేష్ మొదటి సినిమాకే అడ్డంకులు ఏర్పడ్డాయని తెలుస్తుంది.
అయితే ఈ విషయంపై రాకేష్ స్పందిస్తూ ఒక వీడియోని షేర్ చేశారు.
ఈ సందర్భంగా రాకేష్ తన సినిమా విడుదల గురించి మాట్లాడుతూ ఈ సినిమాని నవంబర్ 17వ తేదీ లేదా 24వ తేదీ విడుదల చేయాలనుకున్నాను అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో సెన్సార్ వాళ్ళు ఈ సినిమా విడుదల చేయకూడదని చెప్పారు.అయితే ఈ సినిమాలో ఏ జానర్ లో ఉండబోతుందన్న విషయాలను తాను సెన్సార్ వాళ్ళకి వివరించానని తెలిపారు.ఇక ఈ సినిమా వాయిదా పడటం కూడా మన మంచికే జరిగిందని నేను భావిస్తున్నాను ఎందుకంటే సినిమాని ప్రమోట్ చేయడానికి సమయం లేదు కానీ ఇప్పుడు వాయిదా పడటంతో ప్రమోషన్లకు మరి కాస్త సమయం దొరుకుతుందని తెలిపారు.
అయితే అందరూ బినామీల ద్వారా నేను ఈ సినిమా చేశానని వార్తలు వస్తున్నాయి.కానీ ఈ సినిమా కోసం ఎవరు నాకు డబ్బు ఇవ్వలేదు సినిమాపై ఉన్న ఫ్యాషన్ తోనే ఈ సినిమాని చేశాను అంటూ ఈయన తెలిపారు.