ఈమద్య కాలంలో బుల్లి తెరపై కామెడీ షో లు మరియు డాన్స్ షో లు సక్సెస్ అవ్వాలంటే ఇతర షో లపై జనాల దృష్టి ఆకర్షించేందుకు గాను లవ్ ట్రాక్స్ పెళ్లి కహానీలు అల్లుతున్నారు.జబర్దస్త్ ప్రారంభం అయినప్పటి నుండి దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాలుగా కమెడియన్ సుడిగాలి సుధీర్ మరియు రష్మిక ల మద్య ప్రేమ వ్యవహారం అంటున్నారు.
కాని ఇప్పటి వరకు వారు మాత్రం మేమే మంచి స్నేహితులం అంటూ చెబుతూ వస్తున్నారు.జబర్దస్త్ షో ను జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు వారిద్దరి ప్రేమ వ్యవహారంను మరింత హైలైట్ చేసేలా ప్రయత్నాలు చేశారు.
ఇక వారిద్దరి పెళ్లి అంటూ ఎన్నో సార్లు చేశారు.రష్మిక మరియు సుడిగాలి సుధీర్ ల పెళ్లి నిజంగా అయ్యిందని కొందరు.
ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అంటూ మరి కొందరు అనుకుంటూ ఉన్నారు.కాని అసలు విషయం ఏంటీ అంటే వారిద్దరి మద్య ఏమీ లేదు.

రష్మిక మరియు సుదీర్ ల తరహాలో ఈమద్య చాలా మంది వచ్చారు.ఇటీవల ఎమాన్యూల్ మరియు వర్షల జోడీ అంటున్నారు.వీరిద్దరి పెళ్లి అంటూ ఇటీవల ఒక షో లో చేశారు.ఆ పెళ్లి ఎపిసోడ్ కు మంచి రేటింగ్ వచ్చింది.ఇక ఆది మరియు దీపిక పిల్లి ఒక జంట అంటూ ఢీ డాన్స్ షో లో చెబుతూ ఉంటారు.వీరిద్దరి కి కూడా జబర్దస్త్ వారు పెళ్లి చేసేందుకు సిద్దం అయ్యారు.
ఆది మరియు సుధీర్ ల వచ్చే వారం కామెడీ స్కిట్ లో భాగంగా రష్మి మరియు దీపిక లను వారు పెళ్లి చేసుకుంటారు.ముందు ముందు మరెన్ని చూడాలో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇతర జంటలు ఎన్ని వచ్చినా కూడా సుధీర్ మరియు రష్మిల జోడీ ఎవగ్రీన్.ఇద్దరు ప్రేమలో లేరు అని చెబుతున్నా కూడా ముందు ముందు అయినా ప్రేమలో పడుతారేమో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.