తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం సీక్వెల్స్ హవా నడుస్తుంది.ఇక ఇప్పటికే బాహుబలి, బాహుబలి 2 సినిమా రాగా ప్రస్తుతం పుష్ప, పుష్ప 2 వస్తుంది అలాగే సలార్, సలార్ 2, దేవర, దేవర 2 సినిమాలు ప్రేక్షకులను అలరించబోతున్నాయి.
ఇక ఇప్పుడు హీరోయిన్ సిద్దు జొన్నల గడ్డ చేసిన డీజె టిల్లు కి సీక్వెల్ గా డీజే టిల్లు స్క్వేర్( Tillu Square ) అనే సినిమా వచ్చినప్పటికీ ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ తో ప్రేక్షకుల్ని అలరిస్తూ ముందుకు సాగుతుంది.ఇక ఈ సినిమాకి 100 కోట్ల కలెక్షన్స్ వచ్చాయని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

రెండు సినిమాలు కూడా హిట్ అవడంతో దానికి సీక్వెల్ గా మూడోవ సినిమా కోసం ప్రయత్నం చేస్తున్నారు.ఇక అందులో భాగంగానే డీజే టిల్లు క్యూబ్( DJ Tillu cube ) అనే టైటిల్ ను కూడా రిజిష్టర్ చేయించినట్టుగా తెలుస్తుంది.మరి ఈ సినిమా విషయంలో ఇప్పటికే సిద్దు జొన్నలగడ్డ కథని కూడా రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ ఈ( Naga Vamsi ) సినిమాని నిర్మిస్తున్నాడు.
మరి ఇదిలా ఉంటే ఈ సినిమాతో మరోసారి సిద్దు జొన్నలగడ్డ తన మార్క్ కామెడీ ని రిపీట్ చేయాలని చూస్తున్నాడు.ఈ సినిమా వచ్చే సంవత్సరం సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి.
ఇక ఇప్పటికే డీజే టిల్లు క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.కాబట్టి ఆ క్యారెక్టర్ ని ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులు సిద్దు జొన్నల గడ్డ ఆ క్యారెక్టర్ లో చూడడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
మరి ఇలాంటి క్రమం లోనే ఆ క్యారెక్టర్ ని చేయాలనుకోవడం మంచి విషయమనే చెప్పాలి.

ఈ సినిమా మీద ప్రొడ్యూసర్స్ కి మంచి ప్రాఫిట్స్ అయితే వస్తున్నాయి.కాబట్టి దీనికి ప్రంచైజర్స్ గా సినిమాలను చేయాలని చూస్తున్నారు.ఇక అందులో భాగంగానే డీజే టిల్లు క్యూబ్ లో నేహా శెట్టి, అనుపమ పరమేశ్వరన్ తో పాటు మరొక కొత్త హీరోయిన్ కూడా ఉండబోతుంది.
అయితే ఈ సినిమాలో హీరో డిజే టిల్లు గా కనిపిస్తూనే తను ఎవరి చేతిలో మోసం చేయకుండా అతనే వేరే వారిని మోసం చేసే విధంగా తన క్యారెక్టర్ ని డిజైన్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది…
.