కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ పేరు ఇదేనా ?

చాలా రోజులుగా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు.దేశంలో కాంగ్రెస్,  బిజెపిలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ని తెరపై తీసుకువచ్చేందుకు తాను కీలకం అయ్యేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

 Is This The Name Of Kcr S New National Party , Kcr, Telangana, Trs, Bharat Ryth-TeluguStop.com

దీనిలో భాగంగానే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను దేశవ్యాప్తంగా ఉన్న బిజెపి వ్యతిరేక ప్రాంతీయ పార్టీల అధినేతలను కలుస్తూ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.కేంద్రంలో బిజెపి అధికారంలోకి రాకుండా చేయడమే ఏకైక లక్ష్యంగా కేసీఆర్ ముందుకు వెళ్తున్నారు.

తెలంగాణలో తమకు ప్రధాన శత్రువుగా మారిన బిజెపిని జాతీయస్థాయిలో దెబ్బతీసేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు.ఈ క్రమంలోనే కొత్తగా జాతీయ పార్టీని స్థాపించేందుకు ప్రయత్నాలు చేస్తూ, అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటున్నారు.
  గతంలో కేసిఆర్ ప్రారంభించబోయే పార్టీ పేరు భారత రాష్ట్ర సమితి ( బీఆర్ఎస్) అని ప్రచారం జరిగింది .అయితే కేసీఆర్ ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారట.జాతీయస్థాయిలో రైతు అంశాన్ని ప్రాధాన్యంగా తీసుకుంటే తమకు కలిసి వస్తుందని , రైతు అజెండాతో ముందుకు వెళ్తేనే జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందవచ్చు అని , జనాల్లోకి పార్టీని తీసుకువెళ్ల వచ్చు అనే ఆలోచన తో ‘ భారత రైతు సమితి‘గా పార్టీ పేరును ఫైనల్ చేసినట్లు సమాచారం.ముందుగా ఇతర పార్టీలను కలుపుకుని వెళ్లి జాతీయస్థాయిలో బలపడాలని కేసీఆర్ ప్రయత్నాలు చేసినా, ఇప్పుడున్న పరిస్థితుల్లో జాతీయ పార్టీ పెట్టడమే మంచిదనే అభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నారట.
 

Telugu Amith Sha, Bharatrythu, Congress, Kcr Central, Kcr, Modhi, Telangana-Poli

జాతీయ పార్టీ ద్వారానే బిజెపిని ఇరుకును పెట్టవచ్చని,  రాజకీయంగా పై చేయి సాధించవచ్చనే లెక్కల్లో కేసీఆర్ ఉండడం తో ఈ నిర్ణయం తీసుకున్నారట.జాతీయస్థాయిలో కొత్త పార్టీ ఏర్పాటు చేయడమే కాకుండా, అధికారం తీసుకురావడం వంటి విషయాలపై నే కేసీఆర్ ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు.కానీ అంతకంటే ముందుగా తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు టిఆర్ఎస్ ను గెలిపించుకోవడం కేసీఆర్ కు అత్యవసరం.రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వస్తేనే జాతీయస్థాయిలో కేసీఆర్ కొత్తగా స్థాపించబోయే పార్టీకి మనుగడ ఉంటుంది.

లేకపోతే ఎన్నో ఇబ్బందికర పరిస్థితులను కెసిఆర్ ఎదుర్కోవాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube