ప్రస్తుతం తెలంగాణ ( Telangana ) లో ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి.మొన్నటి వరకు బీఆర్ఎస్ బిజెపిని టార్గెట్ చేసినప్పటికీ కాంగ్రెస్ పుంజుకోవడంతో బిజెపిని పక్కనపెట్టి కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తోంది.
అయితే తాజాగా బీజేపీ ( BJP ) ప్రభుత్వం కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తున్నట్టు ప్రత్యక్షంగా ప్రజలే చూస్తున్నారు అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.ఎందుకంటే వరుసగా కాంగ్రెస్ నాయకుల కార్యాలయాల్లో ఐటి దాడులు దేనికి సంకేతం అంటూ చాలామంది రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.
మొన్న తుమ్మల నాగేశ్వరరావు నేడు పొంగులేటి శ్రీనివాస్ రావు ఇలా వరుసగా కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో, కార్యాలయాల్లో ఐటీ సోదాలు చేయడం వెనుక ఏదో కుట్ర జరుగుతుందని బీఆర్ఎస్ బిజెపి ప్రభుత్వాలు రెండు కలిసే ఇలా చేయిస్తున్నారని అందరూ భావిస్తున్నారు.
అంతేకాదు బిజెపి బిఆర్ఎస్ ( BRS ) నాయకుల ఇళ్ళలో ఐటి సోదాలు చేయకుండా కేవలం కాంగ్రెస్ నాయకుల కార్యాలయాల్లోనే ఎందుకు ఐటీ సోదాలు చేస్తున్నారని అనుమాన పడుతున్నారు.
అయితే తమిళనాడులో ఎన్నికలు జరిగిన సమయంలో కూడా డీఎంకే పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడం వల్ల ఇటు కాంగ్రెసు నాయకులు అటు డీఎంకే నాయకులు ఇద్దరి ఇళ్లలో ఐటి సోదాలు జరిపినప్పటికీ చివరికి అక్కడ డిఎంకె పార్టీనే అధికారంలోకి వచ్చింది.
అయితే ప్రస్తుతం కూడా బిజెపి కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ ఒకరి తర్వాత ఒకరి ఇళ్లలో ఐటీ సోదాలు జరిపించడంతో బిజెపి బీఆర్ఎస్ ప్రభుత్వాలు కాంగ్రెస్ కు భయపడే అలా లేనిపోని దుమరాలు సృష్టించాలని ఇలా చేస్తున్నారని,ఎవరు ఎన్ని చేసినా కూడా కాంగ్రెస్ నాయకులకు ఏమీ కాదని,దేశంలో కాంగ్రెస్ సునామీ రాబోతుందనే ఉద్దేశంతోనే, ఎలాగైనా తొక్కేయాలని చూస్తున్నారు.కానీ ఎన్ని పార్టీలు ఏం చేసినా కూడా కాంగ్రెస్ కి ఏమీ జరగదని రేవంత్ రెడ్డి ( Revanth reddy ) స్పష్టం చేశారు.
ఇక అప్పట్లో తమిళనాడు అలాగే ఈ మధ్యకాలంలో కర్ణాటక ( Karnataka ) ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రియాంక ఖర్గే,మల్లికార్జున ఖర్గే కుమారుడు,డీకే శివకుమార్ వంటి నాయకులు ఇళ్లలో సోదాలు జరిపారు.ఇక అక్కడ కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.ఇక వీటన్నింటినీ గమనిస్తే కనుక తమిళనాడులో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్న డిఎంకె పార్టీనే అధికారంలోకి వచ్చింది.
అలాగే కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ( Congress ) ప్రభుత్వం వచ్చింది.ఇక ఈ లెక్కన చూస్తే తెలంగాణలో కూడా బిజెపి పార్టీ కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేసినప్పటికీ కాంగ్రెస్ కు మాత్రం లాభమే తప్ప నష్టం లేదని కాంగ్రెస్ కూడా అధికారంలోకి వస్తుంది అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మరి చూడాలి ఎన్నికల రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది.