ఒక డైరెక్టర్ సినిమా తీశాడు అంటే దాని వెనక చాలా కష్టాలు పడి ఆ సినిమాని తెరకెక్కించాడు అని మనం అర్థం చేసుకోవాలి.ఎందుకంటే ఒక డైరెక్టర్ తను కథ రాసుకున్నప్పుడు అది ఒకల ఉంటుంది.
ఆ తర్వాత హీరో దగ్గరికి వెళ్ళినప్పుడు మార్పులు చేయాల్సి ఉంటుంది.అలాగే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మరోరకంగా మార్చాల్సి ఉంటుంది.
అందుకే ఒక సినిమా తీసి హిట్టు కొట్టి ఒక డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు అంటే గ్రేట్ అనే చెప్పాలి.మనం రాసుకున్న ఒక కథను వాళ్లు చెప్పినట్టుగా చేంజెస్ చేసి కూడా తీసి హిట్టు కొట్టగలిగాడు అంటే నిజంగా ఆ డైరెక్టర్ చాలా టాలెంటెడ్ డైరెక్టర్లు అనే చెప్పాలి.
ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో అలాంటి డైరెక్టర్లు చాలామంది ఉన్నారు హీరోలు చెప్పిన చేంజెస్ వల్ల చాలామంది డైరెక్టర్లకి ప్లాప్ లు కూడా వచ్చాయి.అలాంటి డైరెక్టర్లలో జాదుగాడు( Naga shourya ) సినిమా డైరెక్టర్ ఒకరు ఈ సినిమాలో నాగశౌర్య హీరోగా నటించాడు అయినప్పటికీ ఈ సినిమా డైరెక్టర్ రాసుకున్న స్టోరీకి స్క్రీన్ మీద వచ్చిన స్టోరీ కి సంబందం లేకుండా వేరేగా ఉంటుంది.అందుకే ఈ సినిమా ఫ్లాప్ అయింది అనేది అప్పట్లో పెద్ద టాక్ గా వినిపించింది.ఈ సినిమాకి డైరెక్టర్ యోగేష్ గారు ఈయన రవితేజతో ఒక రాజు ఒక రాణి( Oka Raju Oka Rani )అనే ఒక సినిమా తీశారు.
అలాగే వెంకటేష్ తో చింతకాయల రవి అని ఇంకో సినిమా తీశారు.
దాని తర్వాత జాదూగాడు అనే సినిమా తీశారు ఆయనకు ఇది మూడో సినిమా అయినప్పటికీ ఈ సినిమాని హిట్ చేయడంలో ఆయన ఫెయిల్ అయ్యారనే చెప్పాలి.ఈ సినిమా ఫ్లాప్ అవడంతో ఆయన ఆల్మోస్ట్ ఇండస్ట్రీ నుంచి ఫెడ్ అవుట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అనే చెప్పాలి.ఇంతకుముందు ఈయన తీసిన సినిమాల్లో చింతకాయల రవి సినిమా ఎంటర్టైన్మెంట్ వే లో చాలా బాగుంటుంది కానీ ఈ సినిమా కూడా ఆశించిన విజయాన్ని అందించలేదు జస్ట్ యావరేజ్ గా ఆడింది అంతే…
.