పవన్ పక్కా అవకాశవాదేనా ?

ఏపీ రాజకీయాలు ఏ స్థాయిలో హాట్ హాట్ గా సాగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.ముఖ్యంగా ఈ మద్య జనసేన అధినేత పవన్ కల్యాణ్ ( Pawan Kalyan )అనుసరిస్తున్న వ్యూహాలు, తీసుకుంటున్న నిర్ణయాలు ఇతర పార్టీ నేతలకు ఏమాత్రం అంతుచిక్కడం లేదు.

 Is Pawan An Opportunist , Pawan Kalyan , Tdp , Janasena Party , Ycp , Bjp Par-TeluguStop.com

ఎందుకంటే ఎప్పటికప్పుడు తన నిర్ణయాలను మార్చుతూ కన్ఫ్యూజన్ పాలిటిక్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారారు పవన్.దీంతో అసలు పవన్ స్ట్రాటజీ ఏంటి అనేది ఎవరికి అర్థం కానీ విషయం.

మొదటి నుంచి బీజేపీతో పొత్తు ఉంటుందని చెబుతూ వచ్చిన పవన్.ఏ పార్టీతో ఏనాడు కలిసి కార్యకలాపాల్లో పాల్గొనలేదు.

Telugu Bjp, Janasena, Pawan Kalyan-Politics

కానీ ఉన్నఫలంగా ఇటీవల మళ్ళీ టీడీపీతో( TDP ) పొత్తు ప్రకటించారు జనసేనాని అంతే కాకుండా టీడీపీతో కలిసి అందూస్తామని వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని చెబుతున్నారు.కానీ ప్రభుత్వ ఏర్పాటులో ఎక్కడ బీజేపీ ప్రస్తావన తీసుకురాలేదు.దాంతో కమలనాథులు కూడా తలలు పట్టుకుంటున్నారు.జనసేన పార్టీని మిత్రపక్షంగా భావించాలా ? లేదా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవలా అనేది రాష్ట్ర బీజేపీ నేతలకు కూడా అర్థం కావడంలేదు.ఇకపోతే ఇటీవల పెడనలో జరిగిన వారాహి యాత్రలో భాగంగా పవన్ చేసిన వ్యాఖ్యాలు రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యాయి.

Telugu Bjp, Janasena, Pawan Kalyan-Politics

టీడీపీ బలహీనంగా ఉందని.టీడీపీతో కలిస్తేనే జగన్ ను గద్దె దించవచ్చని అందుకే టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు ఎన్డీయే నుంచి కూడా బయటకు వచ్చాననే సంకేతాలు ఇచ్చారు.దాంతో జనసేన ఎన్డీయే నుంచి బయటకు వచ్చిందనే వార్తలు గట్టిగా వినిపించాయి.

మళ్ళీ అంతలోనే ఎన్డీయే నుంచి తాను బయటకు రాలేదని, అదంతా వైసీపీ( YCP ) వాళ్ళు సృస్తిస్తున్న రూమర్స్ అంటూ కొట్టిపాడేశారు.దీంతో అసలు పవన్ ఏం ఆలోచిస్తున్నారనే చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం పవన్( Pawan Kalyan ) వైఖరి గమనిస్తున్న రాజకీయవాదులు ఆయన అస్థిర నాయకూడని, అవకాశవాది అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.మరి ముందు రోజుల్లో పవన్ తన నిర్ణయాలతో ఇంకేత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube