పవన్ పక్కా అవకాశవాదేనా ?

ఏపీ రాజకీయాలు ఏ స్థాయిలో హాట్ హాట్ గా సాగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.

ముఖ్యంగా ఈ మద్య జనసేన అధినేత పవన్ కల్యాణ్ ( Pawan Kalyan )అనుసరిస్తున్న వ్యూహాలు, తీసుకుంటున్న నిర్ణయాలు ఇతర పార్టీ నేతలకు ఏమాత్రం అంతుచిక్కడం లేదు.

ఎందుకంటే ఎప్పటికప్పుడు తన నిర్ణయాలను మార్చుతూ కన్ఫ్యూజన్ పాలిటిక్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారారు పవన్.

దీంతో అసలు పవన్ స్ట్రాటజీ ఏంటి అనేది ఎవరికి అర్థం కానీ విషయం.

మొదటి నుంచి బీజేపీతో పొత్తు ఉంటుందని చెబుతూ వచ్చిన పవన్.ఏ పార్టీతో ఏనాడు కలిసి కార్యకలాపాల్లో పాల్గొనలేదు.

"""/" / కానీ ఉన్నఫలంగా ఇటీవల మళ్ళీ టీడీపీతో( TDP ) పొత్తు ప్రకటించారు జనసేనాని అంతే కాకుండా టీడీపీతో కలిసి అందూస్తామని వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని చెబుతున్నారు.

కానీ ప్రభుత్వ ఏర్పాటులో ఎక్కడ బీజేపీ ప్రస్తావన తీసుకురాలేదు.దాంతో కమలనాథులు కూడా తలలు పట్టుకుంటున్నారు.

జనసేన పార్టీని మిత్రపక్షంగా భావించాలా ? లేదా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవలా అనేది రాష్ట్ర బీజేపీ నేతలకు కూడా అర్థం కావడంలేదు.

ఇకపోతే ఇటీవల పెడనలో జరిగిన వారాహి యాత్రలో భాగంగా పవన్ చేసిన వ్యాఖ్యాలు రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యాయి.

"""/" / టీడీపీ బలహీనంగా ఉందని.టీడీపీతో కలిస్తేనే జగన్ ను గద్దె దించవచ్చని అందుకే టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు ఎన్డీయే నుంచి కూడా బయటకు వచ్చాననే సంకేతాలు ఇచ్చారు.

దాంతో జనసేన ఎన్డీయే నుంచి బయటకు వచ్చిందనే వార్తలు గట్టిగా వినిపించాయి.మళ్ళీ అంతలోనే ఎన్డీయే నుంచి తాను బయటకు రాలేదని, అదంతా వైసీపీ( YCP ) వాళ్ళు సృస్తిస్తున్న రూమర్స్ అంటూ కొట్టిపాడేశారు.

దీంతో అసలు పవన్ ఏం ఆలోచిస్తున్నారనే చర్చ జరుగుతోంది.ప్రస్తుతం పవన్( Pawan Kalyan ) వైఖరి గమనిస్తున్న రాజకీయవాదులు ఆయన అస్థిర నాయకూడని, అవకాశవాది అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

మరి ముందు రోజుల్లో పవన్ తన నిర్ణయాలతో ఇంకేత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారో చూడాలి.

వైరల్ వీడియో: అమ్మాయి షూలో నాగుపాము.. జాగ్రత్త సుమీ..