యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ( Nikhil Siddharth ) ప్రజెంట్ రెండు పాన్ ఇండియన్ ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు.అందులో ఒకటి ‘స్వయంభు’.
( Swayambhu ) కార్తికేయ 2( Karthikeya 2 ), 18 పేజెస్ వంటి సినిమాలు సక్సెస్ తర్వాత స్పై తో ప్రేక్షకుల ముందుకు వచ్చి పర్వాలేదు అనిపించు కున్నాడు.
ఇక ఇప్పుడు క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టుకున్నాడు.
మరి కెరీర్ బ్లాక్ బస్టర్ గా సాగిపోతుంటే పర్సనల్ లైఫ్ లో కూడా గుడ్ న్యూస్ చెప్పినట్టు తెలుస్తుంది.నిఖిల్ తన భార్యతో కలిసి ఇటీవలే ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కు వెళ్లగా అక్కడ తన భార్య పల్లవి వర్మ( Pallavi Varma ) బేబీ బంప్ తో కనిపించింది అని టాక్.
పైగా ఈ ఫోటోను నిఖిల్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.కాగా హీరో నిఖిల్ డాక్టర్ పల్లవి వర్మను కరోనా సమయంలో శంషాబాద్ ప్రాంతం లోని ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో పెళ్లి చేసుకున్నాడు.వీరి పెళ్ళికి దగ్గర బంధువులు మాత్రమే హాజరు అయ్యారు.వీరు రెండేళ్లకు పైగానే ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.
మొత్తానికి వీరి ప్రేమ పెళ్లి వరకు చేరి ఇప్పుడు తల్లిదండ్రులు కూడా కాబోతున్నారు.ఇదిలా ఉండగా నిఖిల్ ప్రజెంట్ భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ‘స్వయంభు’( Swayambhu ) సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమాను పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ లు సంయుక్తంగా నిర్మిస్తుండగా రవి బసృర్ సంగీతం అందిస్తున్నారు.నిఖిల్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది.