గల్ఫ్ దేశమైన కువైట్ ప్రవాసులకు చుక్కలు చూపిస్తోంది.పొమ్మనలేక పొగ పెట్టిన చందంగా ప్రవాసుల విషయంలో ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకుంటూ ముప్పు తిప్పలు పెడుతోంది.ఇప్పటికే కువైటైజేషన్ పేరుతో ప్రభుత్వ, ప్రవైటు రంగాలలో పనిచేస్తున్న ప్రవాసులకు ఉద్వాసన పలకాలని వ్యూహాలు రచిస్తున్న కువైట్ గడిచిన కొన్ని నెలలుగా 60 ఏళ్ళు పై బడిన ప్రవాసుల విషయంలో చిత్ర విచిత్ర నిర్ణయాలు తీసుకుంటూ వారిని ముప్పు తిప్పలు పెడుతోంది.
60 ఏళ్ళు పై బడిన ప్రవాసులు ఎవరైతే ఉంటారో వారికి వర్క్ పర్మిట్ లు ఇచ్చేది లేదని తమ దేశం విడిచి వెళ్లిపోవాలని మొదట్లో సూచించిన కువైట్ అంతర్గత వ్యవహారాల సంస్థ తరువాత డిగ్రీ అర్హతను విధిస్తూ పలు రకాల షరతులు పెట్టి వర్క్ పర్మిట్ రెన్యువల్ చార్జీలు అమాంతం పెంచేసింది.అయితే డిగ్రీ అర్హతలు లేని వారు ఎంతో మంది ఉంటారని న్యాయం చేయాలని ఎంబసీలు, పలు ప్రవాస సంఘాలు కోరడంతో డిగ్రీ అర్థ లేకపోయినా పరవలేదంటూ మరో ప్రకటన చేసింది.గడిచిన ఆదివారం నుంచీ డిగ్రీ అర్థ లేకపోయినా 60 ఏళ్ళు దాటినా వారికి వర్క్ పర్మిట్ రెన్యువల్ చేపట్టిన కువైట్ ఇక్కడ కూడా మెలిక పెట్టింది.
గతంలో వర్క్ పర్మిట్ కోసం రూ.61 వేలు భీమా కోసం మరో రూ.1.23 లక్షలు కట్టాలని చెప్పగా కష్టమైనా సరే నని ఒప్పుకున్నా పర్మిట్ రెన్యువల్ కోసం వెళ్తున్న ప్రవాసుల నుంచీ అదనంగా రూ.14 వేలు డిమాండ్ చేస్తున్నారట.అక్కడితో ఆగకుండా సాదార ఇన్స్యూరెన్స్ చార్జీలు, పాత రెసిడెన్సీ ఫీజు అది, ఇదీ అంటూ అదనంగా మొత్తం 60 దినార్లు చార్జ్ చేస్తున్నారట.
అసలు చెప్పిన డబ్బులు కట్టడానికె అప్పులు చేయాల్సి ఉంటుందని, అదనంగా వసూలు చేస్తున్న డబ్బులకోసం మేము ఏం చేయాలంటూ ఆవేదన చెందుతున్నారట
.