విమానంలో పయనించడం మీ కలా? అయితే రూ.1,399కే టికెట్ పొందండిలా?

విమాన ప్రయాణం చేయాలని ఇక్కడ ప్రతి ఒక్కరికీ ఉంటుంది.కానీ ఆ కోరిక ఓ వర్గం వారు మాత్రమే తీర్చుకుంటారు.

 Is Flying Your Art But Get A Ticket For Rs 1,399 , Flight , Journey, Travel,139-TeluguStop.com

ఇక్కడ పేద, మధ్య తరగతి వారికి అది ఒక అందని ద్రాక్ష మాదిరి కనబడుతుంది.అయితే అప్పుడప్పుడు వారిని కూడా అంటే ఓ వసంతానికి ఒకసారి కొన్ని విమానయాన సంస్థలు ఊరిస్తూ ఉంటాయి.

కాగా ఇలాంటి సందర్భాలలో కొంతమంది వారి కోరికలు తీర్చుకుంటారు.ఈ క్రమంలోనే అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులోకి వచ్చింది.

ప్రముఖ విమానయాన కంపెనీల్లో ఒకటైన AirAsia అదిరే ఆఫర్ ప్రకటించింది.

ఈ క్రమంలోనే చాలా చవుకైన ధరకే విమాన టికెట్లు అందుబాటులో ఉంచింది.

కాగా ఈ ఆఫర్ పరిమిత కాలం వరకే ఉంటుందని వినియోగదారులు ఇక్కడ గుర్తించుకోవాలి.ఆలోచించినా ఆశాభంగం అన్నట్టు మీలో ఎవరన్నా విమానయానం చేయాలనుకుంటే ఈ కొత్త ఏడాది ఫ్లైట్ జర్నీ చేసేయండి.

ఎందుకంటే ఈ టికెట్ ధర డిస్కౌంట్ ఆఫర్ ఇప్పటికే ముగియాల్సి ఉండగా కంపెనీ మాత్రం ఈ సేల్‌ను పొడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.అంతే కాకుండా టికెట్ ధరలను కూడా మరింత తగ్గించేయడం గమనార్హం.

మొదటిసారి రూ.1497తో విమాన టికెట్లు పొందొచ్చని కంపెనీ ప్రకటించగా ఈ సేల్‌ డిసెంబర్ 25తోనే ముగియాల్సి ఉండగా తాజాగా కంపెనీ ఈ సేల్‌ను పొడిగించింది.కంపెనీ అదిస్తున్న ఈ డిస్కౌంట్ సేల్ డిసెంబర్ 29 వరకు అందుబాటులో ఉండనుంది.అందువల్ల మీరు విమాన టికెట్లు బుక్ చేసుకోవాలని అనుకుంటే ఈ ఆఫర్ తక్షణమే పొందండి.

ఇక ఈ విమాన టికెట్లు బుక్ చేసుకున్న వారు 2023 జనవరి 10 నుంచి 2023 సెప్టెంబర్ 30 వరకు ఎప్పుడైనా ప్రయాణం చేయొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube