విమానంలో పయనించడం మీ కలా? అయితే రూ.1,399కే టికెట్ పొందండిలా?

విమాన ప్రయాణం చేయాలని ఇక్కడ ప్రతి ఒక్కరికీ ఉంటుంది.కానీ ఆ కోరిక ఓ వర్గం వారు మాత్రమే తీర్చుకుంటారు.

ఇక్కడ పేద, మధ్య తరగతి వారికి అది ఒక అందని ద్రాక్ష మాదిరి కనబడుతుంది.

అయితే అప్పుడప్పుడు వారిని కూడా అంటే ఓ వసంతానికి ఒకసారి కొన్ని విమానయాన సంస్థలు ఊరిస్తూ ఉంటాయి.

కాగా ఇలాంటి సందర్భాలలో కొంతమంది వారి కోరికలు తీర్చుకుంటారు.ఈ క్రమంలోనే అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులోకి వచ్చింది.

ప్రముఖ విమానయాన కంపెనీల్లో ఒకటైన AirAsia అదిరే ఆఫర్ ప్రకటించింది.ఈ క్రమంలోనే చాలా చవుకైన ధరకే విమాన టికెట్లు అందుబాటులో ఉంచింది.

కాగా ఈ ఆఫర్ పరిమిత కాలం వరకే ఉంటుందని వినియోగదారులు ఇక్కడ గుర్తించుకోవాలి.

ఆలోచించినా ఆశాభంగం అన్నట్టు మీలో ఎవరన్నా విమానయానం చేయాలనుకుంటే ఈ కొత్త ఏడాది ఫ్లైట్ జర్నీ చేసేయండి.

ఎందుకంటే ఈ టికెట్ ధర డిస్కౌంట్ ఆఫర్ ఇప్పటికే ముగియాల్సి ఉండగా కంపెనీ మాత్రం ఈ సేల్‌ను పొడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.

అంతే కాకుండా టికెట్ ధరలను కూడా మరింత తగ్గించేయడం గమనార్హం. """/"/ మొదటిసారి రూ.

1497తో విమాన టికెట్లు పొందొచ్చని కంపెనీ ప్రకటించగా ఈ సేల్‌ డిసెంబర్ 25తోనే ముగియాల్సి ఉండగా తాజాగా కంపెనీ ఈ సేల్‌ను పొడిగించింది.

కంపెనీ అదిస్తున్న ఈ డిస్కౌంట్ సేల్ డిసెంబర్ 29 వరకు అందుబాటులో ఉండనుంది.

అందువల్ల మీరు విమాన టికెట్లు బుక్ చేసుకోవాలని అనుకుంటే ఈ ఆఫర్ తక్షణమే పొందండి.

ఇక ఈ విమాన టికెట్లు బుక్ చేసుకున్న వారు 2023 జనవరి 10 నుంచి 2023 సెప్టెంబర్ 30 వరకు ఎప్పుడైనా ప్రయాణం చేయొచ్చు.

స్పేస్ నుంచి సన్‌సెట్‌ని ఎప్పుడైనా చూశారా.. వీడియో వైరల్..