ఐపీఎల్ 2022: మరో 2 కొత్త జట్లు.. 90+ మ్యాచులు..?!

ఐపిఎల్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు.భారత క్రికెట్ బోర్డుకు ఐపిఎల్ ఓ గొప్ప ఆదాయ వనరు అనే చెప్పాలి.

 Ipl 2022 Coming With Two More Franchises And Above 90 Matches , Ipl 2022, Ipl, 2-TeluguStop.com

ఐపిఎల్ ప్రతి సంవత్సరం కూడా కాసుల వర్షాన్ని కురిపిస్తోంది.అందుకే బీసీసీఐకి ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా ఐపిఎల్ ను మాత్రం ఆపలేకపోతున్నారు.

ఐపిఎల్ వల్ల మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్ లాంటివి పెరిగిపొతున్నా కూడా ఆరోపణలు వచ్చినా కూడా ఐపిఎల్ ను ఆపడం లేదు.ఎన్ని ఏం జరుగుతున్నా కూడా ఐపిఎల్ కు మాత్రం క్రేజ్ తగ్గడం లేదు.

ప్రతి సంవత్సరం కూడా ఐపిఎల్ లాభాల పంట పండిస్తోంది.ఈ ఐపిఎల్ కు కొన్ని వేల కోట్ల బిజినెస్ జరుగుతోంది.

కరోనా వల్ల అర్ధాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్‌ 14వ సీజన్‌ను సెప్టెంబర్‌-అక్టోబర్‌ నెలలోనే యూఏఈలో నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ తేల్చి చెప్పింది.మరోవైపు అది పూర్తైన వెంటనే టీ20 ప్రపంచకప్‌ను కూడా అక్కడే నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకుంది.

తాజాగా అదే విషయాన్ని బీసీసీఐ స్పష్టం చేసింది.ఈ తరుణంలోనే ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లను కూడా నిర్వహించేందుకు అక్కడ ఉన్నటువంటి పిచ్‌లు దెబ్బతింటాయని దక్షిణాఫ్రికా కోచ్‌ మార్క్‌ బౌచర్‌ తన అభిప్రాయాన్ని తెలిపారు.

ఆ పిచ్ లపై బ్యాట్స్‌మెన్‌కు పరుగులు చేయడం ఇబ్బందిగా మారిపోవడమే కాకుండా స్పిన్నర్లకు కలిసొస్తుందని ఆయన అభిప్రాయపడ్డాడు.ఐపీఎల్‌ తర్వాత యూఏఈలోని పిచ్‌లు తేమ కోల్పోయి డ్రైగా తయారవుతాయన్నారు.

దాంతో పాటుగా దక్షిణాఫ్రికాలో ఆడినట్లు ఇక్కడ బ్యాటింగ్‌ చేసి 180 లేదా 200 పరుగులు చేసే వీలుండదని ఆయన తెగేసి చెప్పాడు.అలాంటి పిచ్ పై ఆ పరిస్థితుల్లో ఆడాలంటే ఎంతో నైపుణ్యం ఉండాలన్నారు.

అక్కడ క్రికెట్ మ్యాచ్ లు చాలా తెలివిగానే ఆడాలని తెలిపారు.

Telugu Teamsn, Matches, Bcci, Ipl, Mark Boucher, Africa, Ups-Latest News - Telug

బీసీసీఐ ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించాలని ఎందుకు నిర్ణయించిందని ఆయన ప్రశ్నించారు.అక్కడ మైదానాలు ఎక్కువగా లేవని, దాంతో పాటుగా పిచ్‌లు దెబ్బతిని పనికిరాకుండా పోతాయని తెలిపారు.ఈ నేపథ్యంలో అక్కడ స్కోర్లు కూడా చాలా తక్కువగానే నమోదవుతాయన్నారు.

బ్యాట్స్‌మెన్‌కు కష్టమైన పరిస్థితులు అనేవి ఏర్పడతాయన్నారు.బౌచర్‌ ఇలా చెప్పడంపై పలువురు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube