వాణిశ్రీ ఫ్యామిలీ గురించి ఈ షాకింగ్ నిజాలు మీకు తెలుసా?

దాదాపుగా రెండు దశాబ్దాల పాటు తెలుగులో నటిగా వాణిశ్రీ పదుల సంఖ్యలో సినిమాల్లో నటించి విజయాలను ఖాతాలో వేసుకున్నారు.వాణిశ్రీ అసలు పేరు రత్నకుమారి కాగా తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాల్లో కూడా ఆమె నటించారు.

 Interesting Facts About Star Actress Vanisree Family Details, Ratnakumari, Vanis-TeluguStop.com

హీరోయిన్ ఆఫర్లు తగ్గిన తర్వాత పెళ్లి చేసుకుని వాణిశ్రీ సంసార జీవితానికి ప్రాధాన్యత ఇచ్చారు.అయితే కొన్నేళ్ల గ్యాప్ తర్వాత వాణిశ్రీ సినిమాల్లో తల్లి పాత్రలతో బిజీ అయ్యారు.

మెట్రిక్యులేషన్ చదువుకున్న వాణిశ్రీ ఆ తర్వాత భరతనాట్యం నేర్చుకున్నారు.కెరీర్ తొలినాళ్లలో వాణిశ్రీ ఎక్కువగా కామెడీ రోల్స్ లో నటించారు.తెలుగులో మరపురాని కథ హీరోయిన్ గా వాణిశ్రీకి తొలి సినిమా కావడం గమనార్హం.నాదీ ఆడజన్మే సినిమా కోసం వెళ్లిన సమయంలో వాణిశ్రీగా ఆమె పేరు మారింది.

ఎస్వీ రంగారావు ఆమె పేరును రత్నకుమారి నుంచి వాణిశ్రీగా మార్చారు.అయితే వాణిశ్రీ ఫ్యామిలీ గురించి కొన్ని నిజాలు అభిమానులకు పెద్దగా తెలియదు.

ఒకనాటి అగ్రహీరోలందరి సరసన వాణిశ్రీ నటించారు.అమ్మాయిలు సైతం వాణిశ్రీలా కనిపించడానికి ఇష్టపడేవారు.

Telugu Ratnakumari, Sv Rangarao, Vanisree-Movie

తక్కువ సమయంలోనే వాణిశ్రీ టాప్ హీరోయిన్ గా ఎదిగారు.వాణిశ్రీ చిన్నతనంలోనే తండ్రిని, అక్కయ్యను, ఇద్దరు తమ్ముళ్లను వాణిశ్రీ కోల్పోయారు.వాణిశ్రీ తల్లి వెంకమ్మతో చాలామంది సావిత్రిలా వాణిశ్రీ ఉంటారని చెప్పడంతో వాణిశ్రీకి సినిమాలపై ఆసక్తి ఏర్పడింది.

Telugu Ratnakumari, Sv Rangarao, Vanisree-Movie

వాణిశ్రీ సినిమాల్లోకి రాకముందు కొన్ని నాటకాల్లో కూడా నటించారు.పేరు మార్పుతో వాణిశ్రీ జీవితమే మారిపోయింది.ఎన్టీఆర్, ఏఎన్నార్ సరసన నటించడంతో వాణిశ్రీకి వరుసగా ఆఫర్లు వచ్చాయి.

వాణిశ్రీని ఆమె బావ మోసం చేయగా వాణిశ్రీ న్యాయపోరాటం చేసి గెలిచారు.తన ఫ్యామిలీ డాక్టర్ అయిన కరుణాకర్ ను వాణిశ్రీ పెళ్లి చేసుకున్నారు.

ఈ దంపతులకు ఒక కొడుకు ఒక కూతురు జన్మించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube