ప్రముఖ దర్శకుడు క్రిష్ షో రన్నర్ గా వ్యవహరిస్తున్న వెబ్ సిరీస్ “9 అవర్స్“.డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఓటీటీ ఈ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ కు తీసుకొస్తోంది.
తారకరత్న, అజయ్, వినోద్ కుమార్, మధు షాలినీ, రవి వర్మ, ప్రీతి అస్రానీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి వై, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ కు నిరంజన్ కౌషిక్, జాకోబ్ వర్గీస్ దర్శకత్వం వహించారు.
పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ జూన్ 2 తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను హీరో వరుణ్ తేజ్ విడుదల చేశారు.
ముగ్గురు దొంగలు, మూడు బ్యాంక్ లను దోచుకోవడంతో ఈ ట్రైలర్ ప్రారంభమైంది.రెండు బ్యాంకుల్లో దోపిడీ చేసి పరారైన దొంగలు, మూడో బ్యాంక్ లో మాత్రం అమాయకులను బంధీలుగా పట్టుకుంటారు.
తమ డిమాండ్స్ నెరవేర్చకుంటే ఒక్కొక్కరిని చంపేస్తుంటారు.ఈ దోపిడీ కేసును పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ తారకరత్న డీల్ చేస్తుంటాడు.
పోలీసులకు దొంగలకు జరిగిన ఈ యుద్ధంలో గెలుపెవరిది అనేది ఉత్కంఠను రేపుతోంది.ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండటంతో వెబ్ సిరీస్ పై అంచనాలు పెరుగుతున్నాయి.