సరికొత్తగా పానీపూరి బిజినెస్.. క్యూ కడుతున్న ప్రజలు..

రోజు రోజుకూ అందరికీ ఖర్చులు పెరుగుతున్నాయి.కుటుంబం మొత్తం సంపాదించినా ఆ డబ్బులు సరిపోవడం లేదు.

 Innovative Sensor Pani Puri Business In Godavarikhani,raju, Godavarikhani, Pedda-TeluguStop.com

దీంతో అదనపు పని చేసి మరీ చాలా మంది సంపాదిస్తున్నారు.ఇంకొందరు పార్ట్ టైమ్‌గా వ్యాపారం( Business ) సైతం చేస్తున్నారు.

దీని కోసం వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు.ప్రస్తుత రోజుల్లో అందరికీ కొత్తదనం కావాలి.

ఇలా ప్రజలను ఆకర్షించే కొత్తదనంతో కొందరు వ్యాపారాల్లో సక్సెస్ అవుతున్నారు.

ఇదే కోవలో తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని( Godavarikhani )కి చెందిన రాజు సరికొత్త వ్యాపారంతో సక్సెస్ అయ్యాడు.

ఆయన కొన్ని రోజుల క్రితం పానీపూరి వ్యాపారం ప్రారంభించాడు.అయితే మనకు రోడ్డు పక్క దొరికే పానీపూరీల్లా కాదండోయ్.దీని కోసం ఒక కొత్త సెన్సార్‌తో కూడిన ఓ మెషీన్ అందుబాటులోకి తెచ్చాడు.దీంతో ఆ ప్రాంతంలో రాజు వ్యాపారానికి గిరాకీ ఏర్పడింది.

స్కూళ్లు, కాలేజీలలో చదివే విద్యార్థులు పెద్ద ఎత్తున అక్కడికి వస్తున్నారు.

Telugu Godavarikhani, Panipuri, Peddapally, Raju, Sensor Machine, Sensorpanipuri

చాలా చోట్ల పానీపూరీ( Panipuri ) బండ్ల వద్ద క్యూ ఎక్కువగా ఉంటుంది.వెయిటింగ్ చేయలేక కొందరు వెళ్లిపోతుంటారు.ఎంత స్పీడుగా ఇచ్చినా కస్టమర్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఇబ్బందిగా ఉంటుంది.

అయితే రాజు పెట్టిన సెన్సార్ మెషీన్‌తో( Sensor Machine ) ఎలాంటి ఇబ్బంది ఉండదు.ఎవరైనా పానీపూరి ఆర్డర్ ఇస్తే వెంటనే రాజు అందులో బఠానీ, ఆలూ వంటివి పెట్టి ఇస్తాడు.

కస్టమర్లు ఆ పానీపూరిని ఓ పైపు లాంటి వస్తువు వద్దకు తీసుకెళ్లాలి.అందులో నుంచి పానీ వచ్చి పడుతుంది.

దీని ద్వారా ఎక్కువ మంది ఒకేసారి పానీ పూరి తినొచ్చు.ఇది ఆ నోటా ఈ నోటా అందరికీ పాకింది.

Telugu Godavarikhani, Panipuri, Peddapally, Raju, Sensor Machine, Sensorpanipuri

దీంతో ఈ సెన్సార్ పానీపూరీ బండి( Sensor Panipuri Machine )వద్దకు ఎక్కువ మంది కస్టమర్లు వస్తున్నారు.దీంతో రాజు వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా సాగుతోంది.కరోనా తర్వాత ఎక్కువ మంది పరిశుభ్రతపై దృష్టిసారిస్తున్నారు.చాలా పానీపూరి బండ్ల వద్ద పరిశుభ్రత ఉండదు.అలాంటి చేతులతోనే పానీపూరి ఇస్తుంటారు.కొందరు గ్లౌజులు కూడా ధరించరు.

ఇలాంటి సమస్యలకు ఈ సెన్సార్ పానీపూరి పరిష్కారం చూపుతుంది.మనిషి చేతులు లేకుండానే మెషీన్ లో నుంచి పానీ వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube