హీరోయిన్ ఇంద్రజకు విచిత్రమైన సమస్య.. ఏం జరిగిందంటే..?

సాధారణంగా అభిమానులు తమ ఫేవరెట్ హీరోహీరోయిన్లకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి వికీపీడియాపై ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు.ఇష్టమైన హీరోహీరోయిన్ల పుట్టినతేదీ వివరాలతో పాటు ఇతర కీలక విషయాలు వికీపీడియా ద్వారానే అభిమానులకు తెలుస్తాయి.

 Actress Indraja Request To Netizens As She Want Some Info About Wikipedia, Heroi-TeluguStop.com

ఒకవేళ వికీపీడియాలో ఆయా సెలబ్రిటీల గురించి తప్పుగా సమాచారం నమోదై ఉంటే మాత్రం ఫ్యాన్స్ కూడా ఆ తప్పు సమాచారమే అసలైన సమాచారమని నమ్మే అవకాశం ఉంది.

సీనియర్ స్టార్ హీరోయిన్ ఇంద్రజకు వికీపీడియా వల్ల విచిత్రమైన సమస్య ఏర్పడింది.తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాల్లో కూడా నటించిన ఇంద్రజ తెలుగులో కృష్ణ, నాగార్జున మరి కొందరు స్టార్ హీరోలకు జోడీగా నటించారు.2007 సంవత్సరం వరకు వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న ఇంద్రజ 2014 సంవత్సరంలో రీఎంట్రీ ఇచ్చారు.ప్రస్తుతం సినిమాల్లో గుర్తింపు తెచ్చిపెట్టే పాత్రలలో ఇంద్రజ ఎక్కువగా నటిస్తున్నారు.

జబర్దస్త్ షోకు గత కొన్ని వారాలుగా జడ్జిగా చేస్తూ ఇంద్రజ మెప్పిస్తున్నారు.

Telugu Heroina Indraja, Indraja, Info Wikipedia, Netizens, Wikipedia, Wrongly En

అయితే వికీపీడియాలో ఈమె పుట్టినరోజు వివరాలతో పాటు ఇతర వివరాలు తప్పుగా నమోదు కావడంతో ఆ వివరాలను సరి చేసుకోవడానికి సహాయం కావాలని ఆమె నెటిజన్లను కోరుతున్నారు.ఇంద్రజ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా వికీపీడియాలో సమాచారాన్ని ఏ విధంగా ఎడిట్ చేయాలో తనకు చెప్పాలంటూ పోస్ట్ పెట్టారు.

కొందరు నెటిజన్లు ఇంద్రజ చేసిన పోస్ట్ గురించి స్పందించి సలహాలు, సూచనలు ఇచ్చారు.తన పోస్ట్ కు రియాక్ట్ కావడంతో పాటు విలువైన సమాచారం ఇచ్చిన నెటిజన్లకు ఇంద్రజ కృతజ్ఞతలు చెప్పారు.

రోజా స్థాయిలోనే జబర్దస్త్ జడ్జిగా పంచ్ లు వేస్తూ ఇంద్రజ మెప్పిస్తుండటం గమనార్హం.సర్జరీలు చేయించుకున్న రోజా ప్రస్తుతం చెన్నైలోని ఇంటిలో చికిత్స చేయించుకుంటున్నారు.త్వరలోనే ఇంద్రజ జబర్దస్త్ లోకి రీఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube