కెనడా: కేబినెట్ పునర్వ్యవస్థీకరించిన ట్రూడో .. భారత సంతతి మహిళా నేతకు ప్రమోషన్..!!

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో( Canadian Prime Minister Justin Trudeau ) తన మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు.ఈ సందర్భంగా భారత సంతతికి చెందిన మహిళా ఎంపీ అనితా ఆనంద్‌కు( MP Anita Anand ) ప్రమోషన్ కల్పించారు.

 Indo-canadian Anita Anand Promoted To Treasury Board President In Notable Cabine-TeluguStop.com

ప్రస్తుతం రక్షణ మంత్రిగా వున్న ఆమెను ట్రెజరీ బోర్డ్ అధ్యక్షురాలిగా నియమించారు.దీనిపై అనిత హర్షం వ్యక్తం చేశారు.

ట్రెజరీ బోర్డ్ ప్రెసిడెంట్ పదవిని స్వీకరించేందుకు తాను ఎదురుచూస్తున్నాని ఆమె వరుస ట్వీట్లు చేశారు.ప్రభుత్వ ఆర్ధిక బృందంలో భాగమైనందుకు గౌరవంగా వుందని అనిత అన్నారు.

గవర్నెన్స్, కేపిటల్ మార్కెట్‌లలో తనకున్న అనుభవంతో కెనడియన్లకు పటిష్టమైన ఆర్ధిక వ్యవస్థను నిర్మించేందుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు.ఇప్పటి వరకు ఈ పదవిలో వున్న మోనా ఫోర్టీయర్‌కు అనిత ధన్యవాదాలు తెలియజేశారు.56 ఏళ్ల అనితా ఆనంద్ ఓక్ విల్లే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

కాగా.

మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిన్ ట్రూడో 2021 అక్టోబర్‌లో ‌తన కేబినెట్‌ను పునర్ వ్యవస్థీకరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.ఈ క్రమంలో కీలకమైన రక్షణ శాఖ బాధ్యతలను అనితా ఆనంద్‌కు అప్పగించారు.

అప్పట్లో కెనడా రక్షణ మంత్రిగా భారత సంతతికే చెందిన హర్జీత్ సజ్జన్( Harjeet Sajjan ) బాధ్యతలు నిర్వర్తించారు.అయితే సైన్యంలో లైంగిక వేధింపుల అంశానికి సంబంధించిన దర్యాప్తులో ఆయన తీరుపై ప్రతిపక్షాలు, మీడియా దుమ్మెత్తిపోశాయి.

దీంతో స్పందించిన ట్రూడో సజ్జన్‌ను రక్షణ శాఖ నుంచి తప్పించి ఆ బాధ్యతలు అనితా ఆనంద్‌కు అప్పగించారు.

Telugu Anita Anand, Canadianpm, Drsaroj, Harjeet Sajjan, Indocanadian-Telugu NRI

అనితా ఆనంద్ తల్లిదండ్రులు భారతీయులే.తల్లి పంజాబ్‌కు చెందిన డాక్టర్ సరోజ్ దౌలత్ రామ్( Dr.Saroj Daulat Ram ), తండ్రి తమిళనాడుకు చెందిన డాక్టర్ సుందర్ వివేక్ ఆనంద్.వీరికి ఐర్లాండ్‌లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఇంగ్లాండ్‌లో పెళ్లి చేసుకున్నారు.భారత్, నైజీరియాలలో నివసించిన వీరు 1965 నుంచి కెనడాలో స్థిరపడ్డారు.ఇప్పటికీ వీరి బంధువులు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరులలో ఉన్నారు.అనిత తాతగారు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు.

Telugu Anita Anand, Canadianpm, Drsaroj, Harjeet Sajjan, Indocanadian-Telugu NRI

2019 అక్టోబర్‌లో అనిత కెనడా పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎన్నికై, ప్రధాని జస్టిన్ టూడ్రో కేబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకున్న మొదటి హిందూ మహిళగా రికార్డుల్లోకెక్కారు.ప్రస్తుతం నలుగురు పిల్లలకు తల్లిగా ఉన్న అనితా ఆనంద్ ఓక్విల్లే ప్రాంతంలోని ప్రజలకు అత్యంత సన్నిహితంగా మెలుగుతారు.రాజకీయాల్లోకి రాకముందు టొరంటో విశ్వవిద్యాలయంలో లా ప్రొఫెసర్‌గా ఆమె సేవలందించారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube