కెనడాలో భారతీయుడు మృతి : క్యూలో వుండగా ఆగిన గుండె , పెళ్లికి ఏర్పాట్లు.. అంతలోనే విషాదం

కెనడాలో విషాదం చోటు చేసుకుంది.గుండెపోటుతో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు.

 Indian Youth From Punjab Dies Of Cardiac Arrest In Canada Details, Indian Youth-TeluguStop.com

మృతుడిని పంజాబ్ రాష్ట్రానికి చెందిన హర్బేజ్ సింగ్ (31)గా( Harbhej Singh ) గుర్తించారు.ఇతనికి పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తుండగా.

ఇంతలోనే ఈ ఘటన చోటు చేసుకుంది.ఎనిమిదేళ్ల క్రితం తన పాఠశాల విద్య ముగిసిన తర్వాత హర్బేజ్ దుబాయ్‌కి వెళ్లిపోయాడు.

అక్కడ డ్రైవర్‌గా కొన్నాళ్లు ఉద్యోగం చేసిన ఆయన.కొన్ని నెలల క్రితమే కెనడాకు( Canada ) వెళ్లాడు.

హర్బేజ్ సింగ్ తన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేయించుకునేందుకు క్యూలో వుండగా.ఛాతీలో ఒక్కసారిగా నొప్పి రావడంతో కుప్పకూలిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.హర్బేజ్ మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండగా గ్రామస్తులు సైతం విషాదంలో మునిగిపోయారు.కెనడా నుంచి అతని మృతదేహాన్ని తీసుకురావడానికి సహాయం చేయాలని కుటుంబ సభ్యులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.

Telugu Canada, Canada Nri, Cardiac, Harbhej Singh, Harbhejsingh, Heart Attack, I

ఇకపోతే.గత నెలలోనూ పంజాబ్‌కు( Punjab ) చెందిన ఓ యువకుడు కెనడాలో ఇలాగే గుండెపోటుతో( Heart Attack ) ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.మృతుడిని హోషియార్‌పూర్‌కు చెందిన జస్వంత్ సింగ్ బజ్వా కుమారుడు కరణ్‌వీర్ సింగ్ బజ్వా (23)గా( Karanveer Singh Bajwa ) గుర్తించారు.ఆయన మరణవార్త తెలియగానే కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు.

కరణ్‌వీర్ తన చదువు కోసం నాలుగేళ్ల క్రితం కెనడా వెళ్లాడని మృతుడి బంధువు సత్పాల్ సింగ్ బజ్వా వెల్లడించారు.తన కుమారుడితో పాటు తన తమ్ముడి కొడుకులు కూడా కెనడాలోనే వున్నారని సత్పాల్ చెప్పారు.

నాలుగేళ్ల విద్యాభ్యాసం తర్వాత కరణ్‌వీర్ . పీఆర్ (శాశ్వత నివాస హోదా) కోసం పత్రాలను సమర్పించాడు.

Telugu Canada, Canada Nri, Cardiac, Harbhej Singh, Harbhejsingh, Heart Attack, I

కరణ్‌వీర్ రాత్రి తన గదిలో ఎప్పటిలాగే పడుకున్నాడని.కానీ ఉదయం ఎంతకీ లేవలేదని బంధువులు తెలిపారు.అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.కరణ్‌వీర్ మరణవార్తను కుటుంబ సభ్యులకు తెలియజేశారు.పోస్ట్‌మార్టం అనంతరం అతని మృతదేహాన్ని భారత్‌కు తరలించనున్నారు.కరణ్‌వీర్ సింగ్ తండ్రి జస్వంత్ సింగ్( Jaswanth Singh ) పంజాబ్ పోలీస్ విజిలెన్స్ విభాగంలో పనిచేసేవారు.

అయితే 2010లో జరిగిన రోడ్డు ప్రమాదంలో జస్వంత్ ప్రాణాలు కోల్పోయాడు.దీంతో కరణ్‌వీర్, అతని సోదరి బాగోగులను బంధువులు చూసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube