వైరల్ వీడియో: ఎన్నారై షాప్‌లో పడ్డ దొంగ.. తరిమి తరిమి కొట్టిన యజమాని..

ఎన్నారైల ఇళ్లలో, షాపులలో ఈ మధ్య దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి.ఈ నేపథ్యంలో నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది.

 Indian Thrashes Robber At Us Departmental Store Viral Video Details, Sikh Man, S-TeluguStop.com

ఆస్తులను అనుక్షణం కాపాడుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది.ఇక పట్టపగలే దొంగలు ఇంటి మీద పడి దాడులు చేస్తుంటే చూస్తూ ఉండి పోవాల్సి వస్తోంది.

తాజాగా అమెరికా దేశం న్యూయార్క్ నగరంలోని( New York City ) ఓ డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో కూడా పట్టపగలే దొంగ తన చేతికి పని చెప్పాడు.కానీ ఇక్కడ యజమాని భిన్నంగా స్పందించాడు.

దొంగతనానికి ప్రయత్నించిన ఆ వ్యక్తిని డిపార్ట్‌మెంటల్ స్టోర్( Departmental Store ) యజమాని ఒక కర్ర తీసుకొని చితకబాదుడు బాదాడు.ఆ యజమాని ఒక సిక్కు వ్యక్తి అని తెలుస్తోంది.

అతను దొంగను కొట్టిన దృశ్యాలకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ముఖం కనిపించకుండా బ్లూ కలర్ గుడ్డ ధరించి దుకాణంలోని వస్తువులను దొంగిలించడానికి ప్రయత్నించిన దొంగను( Thief ) వీడియోలో కనిపించింది.

ఆ వీడియో ప్రకారం, దుకాణ యజమాని జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు, కానీ దొంగ కనిపించని ఆయుధాన్ని చూపి, యజమానిని వెనక్కి వెళ్లిపోమని హెచ్చరించాడు.

అయితే, ఒక స్టోర్ ఉద్యోగి( Store Employee ) జోక్యం చేసుకుని దొంగ చేతులు పట్టుకున్నాడు.అదే అదునుగా భావించిన సిక్కు వ్యక్తి( Sikh ) కర్రను పట్టుకుని దొంగను కొట్టడం ప్రారంభించాడు.సంఘటనను చిత్రీకరిస్తున్న వ్యక్తి జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు, వారిని ఆపమని వేడుకున్నాడు, కానీ సిక్కు వ్యక్తి వదిలేయండి అని వేడుకుంటూ నేలపై పడే వరకు దొంగను కొట్టడం కొనసాగిస్తున్నాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా దీనిని చూసిన చాలా మంది యూజర్లను సిక్కు వ్యక్తి ధైర్యాన్ని ప్రశంసించారు.కొంతమంది వినియోగదారులు యూఎస్‌లో పెరుగుతున్న దుకాణ దోపిడీల గురించి ఆందోళన వ్యక్తం చేశారు.

ఆ దొంగను పోలీసులు పట్టుకునే కటకటాల వెనక్కి నెట్టారా లేదా అనేది ఇంకా తెలియ రాలేదు.

ఇలాంటి దోపిడీలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నందున యజమానులు తమ పరిసరాల్లోని ప్రజలను ఎప్పుడూ గమనిస్తూ ఉండాలి.ఎవరైనా అనుమానాస్పదంగా ఏదైనా కనిపిస్తే, పోలీసులకు ఫిర్యాదు చేయాలి.దొంగపై దాడికి ప్రయత్నిస్తే వారిని తరిమి కొట్టొచ్చు లేదంటే వారి చేతిలో చనిపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి వారు కోరుకున్నది ఇవ్వాలి.

ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి.దొంగ, వారి వాహనం నంబర్, రకం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.దోపిడీ తర్వాత, పోలీసులకు కాల్ చేసి ఏమి జరిగిందో నివేదించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube