ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడేకొద్ది టిడిపి( TDP )లోని ఆసంతృప్తి నాయకులు పెరిగిపోతున్నారు.ముఖ్యంగా కొన్ని కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయడంపై తీవ్ర అసంతృప్తితో ఆ టికెట్ పై ఆశలు పెట్టుకున్న నేతలు ఉన్నారు.
అలాగే ఇతర పార్టీల నుంచి చేరిన వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, వారికి టిక్కెట్ హామీ ఇవ్వడంతో పాటు, అన్ని విషయాలలోను ప్రాధాన్యం ఇవ్వడం, తమను పక్కన పెట్టడంపై అధినేత తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ విషయంలో ఈ పరిస్థితి తలెత్తింది.
మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ను టిడిపిలో చేర్చుకోవడంపై మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్( Kodela Siva Prasada Rao ) తనయుడు శివరాం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
అప్పుడప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ తన అసంతృప్తిని బయటపెడుతున్నారు.ఇప్పటికే సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జి గా కన్నా లక్ష్మీనారాయణ నియమించడంతో అక్కడ ఆయన పని చేసుకుంటున్నారు .కానీ ఇప్పటి వరకు అక్కడ కార్యక్రమాలు నిర్వహించిన కోడలు శివరాం మాత్రం కన్నా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో పాల్గొనడం లేదు .దీంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న 16 మంది సీనియర్ నాయకులకు టిడిపి అధిష్టానం నోటీసులు జారీ చేసింది.
వీరంతా శివరాం మద్దతుదారులే కావడంపై ఇప్పుడు టిడిపిలో వార్ జరుగుతోంది.పార్టీ కోసం 40 సంవత్సరాల నుంచి దాము కష్టపడి పనిచేస్తున్నామని , కానీ తమ సీనియర్టికీ, సిన్సియారిటీకి నోటీసులు బహుమానంగా దక్కాయని వారంతా అధినేత తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.అయితే పల్నాడు జిల్లాలో లోకేష్ పాదయాత్ర జరుగుతున్న నేపథ్యంలోనే ఈ నోటీసులు జారీ కావడం సంచలనంగా మారింది.గతంలో కన్నా లక్ష్మీనారాయణ ( Kanna Lakshmi Narayana )తో సుదీర్ఘకాలం పోరాడమని, ఆయన వల్ల అనేక కేసుల్లో ఇరుక్కున్నామని శివారం వర్గం చెబుతోంది.
ఇప్పుడు కన్నాను పార్టీలోకి తీసుకొచ్చారని, ఆయనను తమపై బలవంతంగా రుద్దుతారా అంటూ శివరాం వర్గీయులు ప్రశ్నిస్తున్నారు .
కనీసం కోడెల శివరాంకు చంద్రబాబు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని , ఆయన వాదనను వినే ప్రయత్నం కూడా చేయడం లేదని మండిపడుతున్నారు.ఇప్పటికే నోటీసులు అందుకున్న నాయకులతో చంద్రబాబు ప్రత్యేకంగా టెలికాన్ఫిరెన్స్ లో మాట్లాడుతారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నా, అది జరగకపోవడం , శివరాం వర్గీయులను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే విధంగా పరిస్థితి ఉండడంతో సత్తెనపల్లి నియోజకవర్గం టిడిపిలో గందరగోళం నెలకొంది.