ప్రస్తుత కాలంలో బిజీ షెడ్యూల్ కారణంగా చాలామంది మహిళలు మనస్ఫూర్తిగా పూజలు చేసుకోవడానికి కూడా సమయం లేకుండా పోయింది.ముఖ్యంగా చెప్పాలంటే ఉదయం సమయంలో ఆఫీసుకు వెళ్లే మహిళలకు ఇంటిని శుభ్రపరచుకొని పూజలు చేయడానికి అస్సలు కుదరడం లేదు.
ఒకవేళ పూజ చేసిన ఇంటి పనులు అలానే మిగిలిపోతున్నాయి.అయితే కొందరు దీపం( Deepam ) పెట్టిన తర్వాత ఇల్లు శుభ్రం చేస్తుంటారు.
అలా చేయవచ్చా లేదా అనే సందేహాలు చాలామందిలో అలానే ఉన్నాయి.మరి ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తవానికి ఏ మహిళ అయినా పురుషుడైన ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టబోయే ముందు ఇల్లు శుభ్రపరచుకొని పూజ మందిరంలో తులసి కోట దగ్గర దీపారాధన( Deeparadhana ) చేసిన తర్వాత ఏ పని మీద వెళ్ళినా శుభ ఫలితాలు లభిస్తాయి అని పండితులు చెబుతున్నారు.స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి ఉద్యోగానికి వెళ్లడంతో ఉదయాన్నే పూజ చేసి వెళ్తారు.వారు ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత ఆ పని వాళ్లు వచ్చి ఇంటిని శుభ్రపరుస్తారు.కొందరు ఇంటి దగ్గర ఉండే మహిళలు భర్త, పిల్లలు ఆఫీస్ కు, స్కూలుకు పంపిన తర్వాత నెమ్మదిగా పూజలు చేసుకుంటూ ఉంటారు.
కానీ శాస్త్రం ప్రకారం ఇంటిని శుభ్రపరచిన తర్వాత పూజ చేయడం ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు.దీపం కొండెక్కిన తర్వాత ఇంటిని శుభ్రపరచుకోవచ్చు.దీపం వెలుగుతుండగానే ఇంటిని శుభ్రం చేస్తే దేవతల ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.ఏ పని చేపట్టిన సకాలంలో జరగదు.అన్నిటిలోనూ నష్టాలు కలిగి అవకాశం ఎక్కువగా ఉంది.కాబట్టి ఉదయం త్వరగా నిద్ర లేచి సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రపరచుకొని పూజ చేయడం మంచిది.
అదే విధంగా ఉదయం 6 గంటలలోపు పూజ చేస్తే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.సూర్యదయానికి ముందు అమృత ఘడియలలో పూజ చేస్తే విష్ణుమూర్తి( Lord Vishnu ) అనుగ్రహం కలిగి అంతా మంచే జరుగుతుంది.
ఉదయం ఆరులోపు పూజ చేయడానికి కుదరని వాళ్ళు కనీసం ఏడు గంటలలోపు పూజ చేయడం ఎంతో మంచిది.
DEVOTIONAL