బ్రిటన్ : లేబర్ పార్టీకి అధినేత్రిగా భారత సంతతి ఎంపీ..?

బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష లేబర్ పార్టీ దారుణ పరాజయాన్ని మూటకట్టుకున్న సంగతి తెలిసిందే.కేవలం 191 సీట్లకే పరిమితమైన ఆ పార్టీకి … ఇది 1935 తర్వాత అత్యంత చెత్త ప్రదర్శన.

 Indian Origin British Mp Labour Party Corbyn-TeluguStop.com

ఎన్నికల్లో పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు జెరెమి కార్బిన్ రాజీనామా చేస్తున్నట్ల ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు పార్టీని నడిపే లీడర్ కోసం లేబర్ పార్టీ నేతలు అన్వేషిస్తున్నారు.

ఈ క్రమంలో భారత సంతతి మహిళా ఎంపీ లీసా నందీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.40 ఏళ్ల లీసా నార్త్ వెస్ట్ ఇంగ్లాండ్‌లోని విగాన్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.అదే సమయంలో ప్రధాని బోరిస్ జాన్సన్‌‌కు చెందిన కన్జర్వేటివ్ పార్టీకి కంచుకోట లాంటి ఈ ప్రాంతాన్ని బద్ధలు కొట్టారు.లీసా నంది మాంచెస్టర్‌లో బ్రిటీష్ తల్లీకి, భారతీయ తండ్రికి జన్మించారు.

Telugu Corbyn, Indianorigin, Telugu Nri Ups-

ఎంపీగా గెలిచిన అనంతరం ఆమె మాట్లాడుతూ.కార్మిక వర్గ ఓటర్లను తమకు అనుకూలంగా మార్చుకోవడంపైనే ఇప్పుడు తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.తాజా ఎన్నికల్లో వారు లేబర్ పార్టీకి ఓటు వేయలేదు.వాస్తవానికి కార్మికులు చాలా సందర్భాల్లో టోరీలను ఎన్నుకున్నారని లీసా గుర్తుచేశారు.గతంలో షాడో క్యాబినెట్ నిర్వహించిన అనుభవం నందీ సొంతం.కార్బిన్ నేతృత్వంలోని లేబర్ పార్టీపై పెరుగుతున్న విమర్శల మధ్య ఆమె ఇటీవలి కాలంలో మౌనం వహించారు.

షాడో బ్రిగ్జిట్ కార్యదర్శి కైర్ స్టార్మర్, బర్మింగ్‌హామ్ ఎంపీ జెస్ ఫిలిప్స్ సైతం లేబర్ పార్టీకి నాయకత్వం వహించేందుకు పోటీపడుతున్నారు.అయితే పార్టీ అనుబంధ విభాగం కార్బినిస్టా హార్డ్ లెఫ్ట్ వింగ్ సాల్ఫోర్డ్ ఎంపీ రెబెకా లాంగ్ బెయిలీకి మద్ధతుగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube