పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాద సంస్థ( Hamas Terrorists ) చేసిన మెరుపుదాడితో ఇజ్రాయెల్ వణికిపోయింది.భూ , జల, వాయు మార్గాల్లో ముప్పేట జరిగిన దాడితో కాసేపు షాక్‌లో వుండిపోయింది.
ఆ వెంటనే తేరుకుని ఉగ్రవాదుల ఎరివేత కార్యక్రమంతో పాటు బందీల విడుదల సహా పాలస్తీనాపై( Palestine ) భీకరదాడులకు దిగింది.దీంతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది.
ముష్కరులు ఇజ్రాయెల్ ప్రజలను కాల్చిచంపడంతో పాటు కొందరిని బందీలుగా తమ వెంట తీసుకుపోయారు.వీరిలో పలువురు విదేశీయులు కూడా వున్నారు.
యుద్ధం కారణంగా ఇరువైపులా దాదాపు లక్ష మందికిపైగా నిరాశ్రయులు కాగా.ఇప్పటి వరకు 1100 మంది ప్రాణాలు కోల్పోయారు.
అయితే ఇజ్రాయెల్‌పై( Israel ) హమాస్ జరిపిన దాడిపై ప్రపంచ దేశాలు తలో రకంగా స్పందిస్తున్నాయి.అరబ్ దేశాలు ఎప్పటిలాగే ఇజ్రాయెల్ తీరును ఖండించగా.పశ్చిమ దేశాలు ఇజ్రాయెల్‌కు బాసటగా నిలిచాయి.అటు ఇజ్రాయెల్‌కు చిరకాల మిత్రదేశం భారత్( India ) కూడా తన మద్ధతు తెలిపింది.ఉగ్రదాడి విషయం తెలుసుకున్న వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ.( PM Narendra Modi ) అండగా వుంటామని హామీ ఇచ్చారు.
మోడీ స్పందనకు భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి నౌర్ గిలెన్( Israeli Ambassador Naor Gilon ) కృతజ్ఞతలు తెలిపారు.ఈ క్లిష్ట సమయంలో భారత్ నైతిక మద్ధతు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయులు ( NRIs ) కూడా ఇజ్రాయెల్‌కు మద్ధతు తెలిపారు.2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి సహా పలువురు ఎన్ఆర్ఐ ప్రముఖులు కూడా ఇజ్రాయెల్‌కు బాసటగా నిలిచారు.నిక్కీ హేలీ( Nikki Haley ) మాట్లాడుతూ.హమాస్, హిజ్బుల్లా, హౌతీ ఇతర ఇరాన్ మద్ధతున్న ఉగ్రవాద సంస్థల దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌తో నిలబడాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
ఇజ్రాయెల్‌కు ఏం జరిగిందో అమెరికాలో అదే సంభవించే అవకాశం వుందని నిక్కీ హేలీ హెచ్చరించారు.గతంలో ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి పనిచేస్తున్న సమయంలో హమాస్‌ను ఖండించడానికి తాను చేసిన ప్రయత్నాలను ఆమె గుర్తుచేశారు.
ఇజ్రాయెల్ ప్రయోజనాలను రక్షించే విషయంలో అంతర్జాతీయ ఒత్తిళ్లకు లొంగిపోకూడదని నిక్కీ హేలీ స్పష్టం చేశారు.