కల్తీ లేని సరుకులు విక్రయించాలి జెడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు( ZPTC Cheeti Laxman Rao ) సరసమైన ధరలకు వినియోగదారులకు అందించాలి బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శ్రీ సాయి మణికంఠ ట్రేడర్సు ను ఎల్లారెడ్డిపేట జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణ్ రావు బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య తో కలిసి బుధవారం ప్రారంభించారు.నాణ్యమైన కల్తీలేని నిత్యావసర సరకులను సరసమైన ధరలకు ప్రజలకు విక్రయించాలని జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణ్ రావు, బిఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య లు అన్నారు.
ఈ ట్రేడర్సు ను గతంలో కామారెడ్డి,సిరిసిల్ల పట్టణాల్లో మాత్రమే ఉండేవని ప్రస్తుతం మండలంలోని చిరు వ్యాపారులకు అందుబాటులోకి ఈ దుకాణాన్ని నెలకొల్పిన వ్యాపారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హారి ,, బిఆర్ఎస్ పార్టీ నాయకులు మీసం రాజం ,మండల ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు గుండా మల్లేష్ గుప్తా, బిఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి,వ్యాపారులు గరిపెల్లి భాస్కర్ గుప్తా, లింగం పల్లి సత్యం , చకిలం మధు గుప్తా, తాటిపెల్లి సుధాకర్ గుప్తా, బొమ్మకంటి వెంకన్న గుప్తా, బొమ్మకంటి పుల్లయ్య గారి శ్రీ నివాస్ గుప్తా, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.