ఏఐ వల్ల 30 కోట్ల ఉద్యోగాలపై ప్రభావం.. సుందర్ పిచాయ్‌ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది.దీనివల్ల రచయితల, కోడ్ రైటర్ల, డేటా అనలిస్టుల జాబ్స్ పోతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

 Impact On 30 Crore Jobs Due To Ai.. Sundar Pichai's Sensational Comments Go Vira-TeluguStop.com

ఈ నేపథ్యంలో అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ గోల్డ్‌మన్‌ శాక్స్‌ ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని స్పష్టం చేసింది.ఈ సంస్థ చాలా పరిశోధనలు చేసి ‘ఆర్థికప్రగతిపై కృత్రిమ మేధ ప్రభావాల ముప్పు’ పేరిట కొన్ని సంచలన విషయాలను బయటపెట్టింది.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వల్ల 30 కోట్ల ఉద్యోగాలపై ప్రభావం పడే ప్రమాదం ఉందని తెలిపింది.

ఇదే సమయంలో ఓ పాడ్‌కాస్ట్‌లో గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌( Sundar Pichai ) ‘ఏఐతో ప్రమాదంలో ఉద్యోగాలు’ అనే అంశంపై మాట్లాడుతూ ఆందోళనలో వ్యక్తం చేశారు.ఏఐ టెక్నాలజీతో ప్రజలు ఉద్యోగాలు కోల్పోవాల్సిందేనా అని ప్రశ్నించగా.అది సాధ్యమేనన్నట్లు అభిప్రాయపడ్డారు.

కానీ పెద్దగా ఉద్యోగాలు పోకపోవచ్చని పేర్కొన్నారు.చాట్‌జీపీటీ, గూగుల్ బార్డ్‌లకు సంబంధించి పాజిటివ్ విషయాలు ఎన్నో ఉన్నాయన్నారు.

అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీకి దీటుగా ఎవరికి వారు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఏఐ( Artificial intelligence ) వినియోగంతో ప్రోగ్రామింగ్‌లో పర్ఫామెన్స్ మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు.చాట్‌జీపీటీ( ChatGPT ), బార్డ్ వంటి ఏఐ టూల్స్‌తో ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం అందరికీ సాధ్యమవుతుందన్నారు.ఇకపోతే ఏఐ టెక్నాలజీ మనుషులు చేయగల చాలా పనులను సమర్థవంతంగా చేయగలవు.

దీని ఫలితంగా కంపెనీలు మనుషులను తీసేసి వీటిని పనిలో పెట్టుకోవచ్చు.అప్పుడు వారి పని వేగవంతంగా పూర్తవుతుంది.

అంతేకాదు, మరింత వారు తమ పనులను పూర్తి చేసుకోవచ్చు.ఈ విషయం కంపెనీలకు లాభం చేకూర్చేదే కానీ సామాన్య ఉద్యోగుల జేబుకే చిల్లు పడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube