ఆ పెంట్‌హౌస్‌ మీకు కావాలంటే రూ.240 కోట్లు చెల్లించాల్సిందే... ఎక్కడ, దేనికంత?

సాధారణంగా మీలో ప్రతి ఒక్కరూ అద్దె కొంపల్లో నివసించి బయటపడినవారే.ముఖ్యంగా పట్టణాల్లో అద్దె ఇళ్లకు మంచి డిమాండ్ ఉంటుంది.

 If You Want That Penthouse, You Have To Pay Rs. 240 Crores Where And For What,-TeluguStop.com

అందులోనూ పెంట్‌హౌస్‌ అంటే దానికి ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంటుంది.దాదాపుగా అందరూ పెంట్‌హౌస్‌ కావాలనే కోరుకుంటారు.

అందుకే వాటి అద్దె కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది.అంతేకదా.

అయితే ఇపుడు దేశంలోనే అత్యంత ఖరీదైన పెంట్‌హౌస్‌ గురించి తెలుసుకుందాం.

Telugu Penthouse, Latest-Latest News - Telugu

ప్రముఖ వ్యాపారవేత్త వెల్‌స్పన్‌ గ్రూప్‌ చైర్మన్‌ బీకే గోయెంకా రూ.240 కోట్లకు తాజాగా ఓ లగ్జరీ పెంట్‌హౌస్‌ సొంతం చేసుకున్నారు.ముంబైలోని వర్లీ లగ్జరీ టవర్‌లోని ఆ పెంట్‌హౌస్‌ కలదు.

తాజాగా దానిని ఆయన కొనుగోలు చేసినట్లు మీడియాకు వెల్లడించాడు.టవర్ Bలో 63, 64, 65వ అంతస్తుల్లో సదరు పెంట్‌హౌస్‌ కలదు.

ఇది దాదాపు 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంటుంది.దీని పక్కనే ఉన్న పెంట్‌హౌస్‌ను ముంబాయ్‌కి చెందిన బిల్డర్ వికాస్ ఒబెరాయ్ 24 కోట్ల రూపాయలకు మాత్రమే కొనుగోలు చేయడం కొసమెరుపు.

Telugu Penthouse, Latest-Latest News - Telugu

కాగా అమ్మకాలకు సంబంధించిన లావాదేవీలు ఈ బుధవారం అనగా ఫిబ్రవరి 8న పూర్తయినట్టు కూడా సమాచారం.దేశ చరిత్రలో ఇప్పటి వరకు విక్రయించబడిన అత్యంత ఖరీదైన అపార్ట్‌మెంట్ ఇదేనని రియల్ ఎస్టేట్ రేటింగ్, రీసెర్చ్ సంస్థ అయిన లియాసెస్ ఫోరస్ వ్యవస్థాపకుడు MB పంకజ్ కపూర్ తాజాగా తెలిపారు.వచ్చే 2 నెలల్లో మరిన్ని అల్ట్రా లక్స్ ఫ్లాట్ విక్రయాలు జరిగే అవకాశం ఉన్నట్లు పంకజ్ కపూర్ తెలిపారు.ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెక్షన్ 54 కింద దీర్ఘకాలిక పెట్టుబడులపై వచ్చే ఆదాయంపై పన్ను మినహాయింపును రూ.10 కోట్లకు కేంద్రం పరిమితం చేయాలని నిర్ణయించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube