ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఇష్టంగా పెంచుకునేవాటిలో కుక్క ముందు స్థానంలో ఉంటుంది.పిల్లి, కుక్క పంది, లాంటి కొన్ని జీవాలని చాలామంది వారి ఇళ్లలో పెంచుకోవడం తరచూ చూస్తూనే ఉంటాం.
ఇంకా అసలు విషయంలోకి వెళితే.తాజాగా ఓ ఇంటి ఓనర్స్ వారి పెట్ డాగ్ ను ( Pet dog )ఇంట్లో వదిలి ఆఫీస్ కి వెళ్ళారట.
అయితే వారు ఆఫీస్ ( Office )నుంచి తిరిగి వచ్చేసరికి వారు దాచుకున్న డబ్బునంత స్వాహా చేసింది కుక్క.స్వాహా చేయడమేంటి అని అనుకుంటున్నారు కదా.
అవునండి వారు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే లోపల వారు దాచుకున్న సుమారు మూడు లక్షల డబ్బులను ఆ కుక్క నోట్లను చూసి ఏమనుకుందో ఏమో కానీ.వాటిని చిందరవందరగా చించేసి వాటిలో కొన్నిటిని తినేసింది.ఆఫీస్ నుంచి వచ్చిన వారికి పరిస్థితి చూసి వెంటనే అలర్ట్ అయ్యారు.అయితే కుక్క చించేసిన నోట్లను తీసుకోని బ్యాంకుకు వెళ్ళగా అక్కడ వారు మీ నోట్లలో జస్ట్ నెంబర్ ఉంటే చాలు తిరిగి మీకు డబ్బులు ఇస్తామని చెప్పడంతో వారు ఊపిరి ఉంచుకున్నట్లు అయింది.
ఇక డబ్బుల కోసం ఇంట్లోనే ప్రతి మూల వెతకడమే కాకుండా.కుక్క మలం, వాంతి ను కూడా ఎత్తుకొని అందులో నోట్ల కోసం వెతకడం మొదలుపెట్టారు.దాదాపుగా 3550 డాలర్ల వరకు నోట్లను కనిపెట్టి బ్యాంకులో ఇవ్వగా వారి డబ్బును ఖాతాలో జమ చేశారు.ఈ విషయం సంబంధించి కుక్క ఓనర్ మాట్లాడుతూ.తన కుక్క నోట్లు తింటుందని తెలియదని.దాంతో తాను కేర్లెస్ గా ఓ చిన్న డబ్బాలో ఉంచానని తెలిపింది.