భారతదేశంలో కులం, మతం అని తేడా లేకుండా అందరూ జరుపుకునే వేడుకల్లో హోలీ ( Holi ) ఒకటి.పండుగలా కాకుండా హోలీని చాలామంది ఓ వేడుకలా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటూ రంగులు పూసుకొని కేవలం అందరూ ఆ రోజంతా ఎంజాయ్ చేస్తారు.
కొంతమంది ఎంజాయ్ చేయడంలో భాగంగా మరికొందరని ఇబ్బంది పెట్టడం కూడా మనం గమనించవచ్చు.ఇందుకు సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం మనం చూసే ఉంటాం.
ప్రస్తుతం ఇదే కోవకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఈ వీడియో గురించి పూర్తి వివరాలు చూస్తే.
ఉత్తరప్రదేశ్ లో( Uttar Pradesh ) ఓ రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఆటోరిక్షానిపై రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఓ వ్యక్తి వాటర్ బెలూన్( Water Balloon ) అమాంతంగా విసిరాడు.అయితే ఆ బెలూన్ ఆటోలో ఉన్న వ్యక్తికి తగిలిందో లేక ఏం జరిగిందో తెలియదు కానీ.ఆటో రిక్షా( Auto Rickshaw ) క్షణ కాలంలో బొక్క బోర్ల పడింది.బెలూన్ విసరడంతో అది డ్రైవర్ కు తగిలి ఉండడంతో దాంతో ఆటో పై కంట్రోల్ తప్పి ఈ ప్రమాదం సంభవించింది అని తెలుస్తుంది.
అయితే ప్రమాదం జరిగిన తర్వాత వాటర్ బెలూన్స్ విసిరినా వ్యక్తి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించిన తీరు వీడియోలో స్పష్టంగా కనబడుతుంది.ఈ సంఘటన సంబంధించి స్థానికులు పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గురైన వ్యక్తిని వెతికే పనులు పడ్డారు పోలీసులు.పండగ పూట సంతోషంగా గడపాలి కానీ.ఇలాంటి సంఘటనలు జరగడం ద్వారా అనేక చోట్ల విషాద ఛాయలు అలుముకుంటున్నాయి.