సినిమాలు అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు.సినిమాని సినిమా పరంగా చూడకుండా సినిమాను లోతుగా పరిశీలించి చూస్తుంటారు కొంతమంది ప్రేక్షకులు.
మరికొందరు లోతుగా చూడకుండా మామూలుగా ఏదో అన్నట్లుగా చూస్తారు.కొన్నిసార్లు పాత్రలను కూడా బాగా లోతుగా పరిశీలిస్తుంటారు.
నటీనటుల పాత్రలను ఎంటర్టైన్మెంట్ గా చూడకుండా ఆ పాత్ర వెనుక ఉన్న అర్ధాన్ని చూస్తారు.అలా సినిమాలో ఒక కథనే కాకుండా పాటలను, నటీనటుల పాత్రలను బాగా గమనిస్తారు.
ఇక కొన్ని సినిమాలలో హీరోయిన్ల పేర్లు, హీరోల పేర్లు భలే గమ్మత్తుగా ఉంటాయి.మరికొన్ని ఆకట్టుకునే విధంగా ఉంటాయి.
అంటే నాచురల్ గా అనిపిస్తుంటాయి.నిజానికి దర్శకులు కథకు తగ్గట్టుగా పాత్రలు.
పాత్రకు తగ్గట్టుగా పేరును పెడుతుంటారు నటీనటులకు.అలా ప్రతి సినిమాలో నటీనటుల పేర్లు అలాగే ఉంటాయి.
హీరోయిన్ల పేర్లలో కొన్ని తెలియకుండానే మంచి ఫీలింగ్ కనిపిస్తుంది.అందులో సీత అనే పేరు మాత్రం బాగా ఆకట్టుకుంటుంది.
ఇక హీరోల పాత్రల పేరు లలో కూడా కాస్త ఆకట్టుకునే విధంగా ఉంటాయి.అందులో ఎక్కువగా రామ్ అనే పేరు హీరోలకు బాగా ఉంటుంది.
నిజానికి ఆ పేరులో ఏదో మ్యాజిక్ ఉన్నట్లు అనిపిస్తుంది.అలా ఇప్పటికి పలు సినిమాలు విడుదల కాగా అందులో కొందరి హీరోల పాత్ర పేర్లు రామ్ అని ఉండగా ఆ పేరుతో ఉన్న సినిమాలు అన్నీ మంచి సక్సెస్ ను అందుకున్నాయి.
ఇదిలా ఉంటే ఈ పేరుతో ఉన్న కొన్ని సినిమాలు ఉండగా.ఇంతకు ఆ సినిమాలు ఏంటంటే.
ఆరెంజ్:
భాస్కర్ దర్శకత్వంలో 2010లో మంచి లవ్ స్టోరీగా సినిమాగా విడుదలైన సినిమా ఆరెంజ్.ఇందులో రామ్ చరణ్ తేజ, జెనీలియా, షాజన్ పదంసీ, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు.
ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర పేరు రామ్.

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు:
2017లో క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విడుదలైన మంచి హిట్ సొంతం చేసుకున్న సినిమా మళ్లీ మళ్లీ ఇది రాని రోజు. ఇక ఈ సినిమాలో శర్వానంద్, నిత్యామీనన్ నటించినట్లుగా నటించారు.ఇక ఇందులో శర్వానంద్ పాత్ర పేరు రామ్.

3:
2012లో ఐశ్వర్య ఆర్ ధనుష్ దర్శకత్వంలో విడుదలైన సినిమా త్రీ.ఇందులో ధనుష్, శృతిహాసన్ కలిసిన నటించగా ధనుష్ పాత్ర పేరు రామ్.ఇక ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది.

96:
2018 ప్రేమకధా చిత్రంగా విడుదలైన సినిమా 96.ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, త్రిష ముఖ్య పాత్రల్లో నటించారు.ఇక ఇందులో విజయ్ సేతుపతి పాత్ర పేరు రామ్.

సీతారామం:
ఇటీవలే హను రాఘవపూడి దర్శకత్వంలో విడుదలైన సినిమా సీతారామం.ఇక ఇందులో దుల్కర్ సల్మాన్, రష్మికా మందన్న, మృణాళిని ఠాకూర్, సుమంత నటించారు.ఇక ఇందులో హీరో పాత్ర పేరు రామ్.ఇక ఈ సినిమాలన్నీ మంచి సక్సెస్ అందుకున్నాయి.