ఆ యాప్ చూపిస్తే మహిళలకు బస్సు ప్రయాణం ఉచితం..?!

ఆడవాళ్ళపై అత్యాచారాలు తగ్గించాలనే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మంచి ఆలోచన చేసింది.దిశా యాప్ ద్వారా మహిళలకు రక్షణగా నిలవనున్నారు పోలీసులు.

 If The App Shows Bus Travel Is Free For Women, Ap Dy Cm , Pushpa Srivani, Vizian-TeluguStop.com

అయితే ఈ దిశా యాప్ గురించి మహిళల్లో అవగాహన కల్పించే క్రమంలో విజయనగరం జిల్లా పోలీసులు ఒక సరికొత్త ఆలోచన చేసారు.అది ఏంటంటే.

విజయనగరంలోని మహిళలు ఫ్రీ గా బస్ లో ప్రయాణం చేసే అవకాశాన్ని కలిపించారు అక్కడ పోలీసులు.కానీ అలా ఫ్రీ గా తిరగాలంటే మీ స్మార్ట్ ఫోన్ లో ఈ యాప్ తప్పనిసరిగా ఉండాలి.

ఇంతకీ ఆ యాప్ ఏంటి అనుకుంటున్నారా.? మీ యొక్క స్మార్ట్ ఫోన్ లలో దిశా యాప్‌ ను ఇన్స్టాల్ చేసుకుని చూపిస్తే చాలు.విజయనగరం పట్టణంలోని ముఖ్య ప్రాంతాల నుంచి వేరే ప్రాంతాలకు ఉచితంగా ప్రయాణించే అవకాశం వచ్చినట్లే.ఈ విషయాన్నీ విజయనగరం జిల్లా ఎస్పీ దీపికా పాటిల్‌ వెల్లడించారు.ఇందుకోసం పోలీస్‌ వారు రెండు బస్సులను కూడా అందుబాటులోకి తెచ్చినట్టు ఆమె తెలిపారు.

విజయనగరంలో దిశా యాప్‌ పై మహిళల్లో అవగాహన కల్పించేందుకు ఏర్పరిచిన ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి కూడా విచ్చేశారు.

ఈ సందర్భంగా పాముల పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు.మహిళల రక్షణ కోసం మన ఏపీ సీఎం జగన్‌ దిశా యాప్ ను ప్రవేశపెట్టరన్నారు.ఎలాంటి విపత్కర పరిస్థితులలో అయినా గాని తనని తాను కాపాడుకునేలా మహిళలకు ఈ దిశా యాప్ అనేది బాగా ఉపయోగపడుతుందని అన్నారు.ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు కాబట్టి.

ప్రతి ఒక్క మహిళ కూడా ఈ దిశా యాప్‌ ను తమ ఫోన్ లో ఉంచుకోవాలని తెలిపారు.దిశా యాప్ విషయంలో అత్యధికంగా డౌన్లోడ్ చేసిన వారిలో విజయనగరం మహిళలే ముందు ఉండాలని అన్నారు.

Telugu Ap Dy Cm, Disha App, Bus Fecility, Pushpa Srivani, Vizianagaram-Latest Ne

ఇప్పటికే దిశా యాప్ గురించి చాలా మందికి ఒక అవగాహన అనేది వచ్చి ఉంటుంది.ఆపద వచ్చినప్పుడు దిశా యాప్ లోని SOS బటన్ పై ఒక్కసారి ప్రెస్ చేస్తే చాలు వెంటనే మీరున్న లొకేషన్, అడ్రెస్ దిశ కమాండ్ కంట్రోల్ రూమ్ కి చేరుతుంది.వెంటనే అక్కడ సిబ్బంది అలెర్ట్ అయ్యి మీరున్న లొకేషన్ కి దగ్గరగా ఉన్న పోలీసులను అక్కడికి పంపడం జరుగుతుంది.అందుకనే ప్రతి ఒక్క మహిళ కూడా దిశా యాప్‌ ను ఉపయోగించుకోవాలని విజయనగరం ఎస్పీ దీపికా పాటిల్‌ చెప్పారు.

అయితే ఇప్పటికే దిశా యాప్ వలన చాలామంది మహిళలు రక్షింపబడ్డారనే వార్తలు మనం వింటూనే ఉన్నాము.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube