వచ్చే నెల తెలంగాణ ప్రాంతం లో సార్వత్రిక ఎన్నికలు( General Elections ) జరగబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.స్థానికి BRS మరియు కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వా నేనా అనే రేంజ్ పోటీ ఉండబోతుంది.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ పార్టీ హవా ఈసారి మాత్రమే అంతంత మాత్రంగానే ఉంటుంది.అయితే ఈ తెలంగాణ ఎన్నికలలో ఆంధ్ర పార్టీలైన టీడీపీ( TDP ) మరియు జనసేన పోటీ చెయ్యబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే.
టీడీపీ పార్టీ 117 స్థానాల్లోనూ పోటీ చెయ్యబోతుండగా, జనసేన పార్టీ కేవలం 32 స్థానాల్లో పోటీ చేయబోతుంది.అయితే ఈ రెండు పార్టీలు ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి గా ఏర్పడి 2024 ఎన్నికలలో పోటీ చేయబోతుంది అనే విషయం మన అందరికీ తెలుసు.
తెలంగాణా లో కూడా అదే విధంగా కలిసి ముందుకు సాగుతారా లేదా అనేది ఇంకా ఖరారు కాలేదు.
ఒకవేళ టీడీపీ – జనసేన( TDP – Janasena ) పార్టీలు కలిస్తే బీజేపీ పార్టీ కి తెలంగాణ ప్రాంతం లో తీవ్రమైన నష్టం ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.వాళ్ళ అంచనా ప్రకారం టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే 15 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని అంటున్నారు.లేటెస్ట్ సర్వేల ప్రకారం బీజేపీ కి 20 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి.
కానీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే బీజేపీ( BJP ) 5 స్థానాల్లో కూడా గెలిచే అవకాశం లేదని అంటున్నారు.బీజేపీ పార్టీ తెలంగాణ అద్యక్ష్యుడు కిషన్ రెడ్డి( Telangana President Kishan Reddy ) ఆంధ్ర పార్టీలతో మాకు ఇక్కడ ఎలాంటి పొత్తు లేదని అంటున్నాడు.
కానీ పవన్ కళ్యాణ్ ఇంకా NDA కూటమి నుండి బయటకి రాలేదు.టీడీపీ – జనసేన కూటమితో చేతులు కలపాలని పవన్ కళ్యాణ్ బహిరంగంగానే బీజేపీ ని రిక్వెస్ట్ చేసాడు.
పవన్ మాటకి గౌరవం ఇచ్చి , ఆంధ్ర ప్రదేశ్ లో ఉనికి చాటుకునే ప్రయత్నం లో బీజేపీ ఆ రెండు పార్టీలతో కలుస్తుందా?, కలిసే తెలంగాణ ఎన్నికలలో ముందుకు పోతుందా?, లేదా తెలంగాణ లో కేవలం జనసేన తో మాత్రమే కలిసి పోతుందా? అనేది తెలియాల్సి ఉంది.ప్రస్తుతం తెలంగాణ లో టీడీపీ పార్టీ చాలా వీక్ గా ఉంది, జనసేన పార్టీ టీడీపీ తో కంటే బీజేపీ తో కలిసి పోటీ చేస్తే చాలా మెరుగైన ఫలితాలు వస్తాయి.ఒకవేళ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే మాత్రం మూడు నష్టపోవాల్సిందే.మరి రాబొయ్యే రోజుల్లో ఏమి జరగబోతుందో చూడాలి.