అతిలోక సుందరి శ్రీదేవి( Heroine Sridevi ) హీరోయిన్ గా టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ మరియు బాలీవుడ్ లో స్టార్ గా సూపర్ స్టార్ గా ఎదిగిన విషయం తెల్సిందే.పెళ్లి, పిల్లల కారణంగా కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీ కి దూరంగా ఉన్న శ్రీదేవి పిల్లలు పెద్ద వారు అవ్వడం తో ఇండస్ట్రీ లో అడుగు పెట్టేందుకు సిద్ధం అయింది.
ఇంతలోనే ఆమె మృతి చెందడం అభిమానులను తీవ్రంగా కలచి వేసింది.రీ ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది అనుకుంటున్న సమయంలో శ్రీదేవి మృతి చెందడం ఆమె అభిమానులకు దుఃఖం ను మిగిల్చింది.
తెలుగు లో రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నటించలేదు.బాహుబలి సినిమా( Baahubali ) లో నటించాల్సిందిగా రాజమౌళి విజ్ఞప్తి చేసినా కూడా కొన్ని కారణాల వల్ల నో చెప్పింది.ఆ సినిమా లో నో చెప్పినందుకు గాను శ్రీదేవి చాలా ఫీల్ అయ్యారట.అందుకే రాజమౌళి( Rajamouli ) తదుపరి సినిమా లో నటించాలని కోరుకున్నారు.కానీ ఇంతలోనే ఆమె మృతి చెందడం జరిగింది.ఒక వేళ శ్రీదేవి బతికి ఉంటే స్టార్ హీరోల అమ్మ పాత్రలకు, అత్త పాత్రలకు కచ్చితంగా ఆఫర్లు దక్కించుకునేది.
హీరోయిన్ గా శ్రీదేవి దక్కించుకున్న క్రేజ్ కి ఏమాత్రం తగ్గకుండా అంతకు మించి అన్నట్లుగానే క్రేజ్ ని సొంతం చేసుకునేది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.పాపం శ్రీదేవి చనిపోవడం వల్ల ఆమె కూతురు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ లు ఇంకా లైఫ్ లో సెట్ అవ్వలేక పోతున్నారు అంటున్నారు.టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో శ్రీదేవి చనిపోవడం వల్ల ఎన్నో అద్భుతమైన పాత్ర లు చూసే అవకాశం కోల్పోయామని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.