Sakshi Vaidya : ఏజెంట్ ఫ్లాప్ పై స్పందించిన సాక్షి వైద్య.. బాధగా అనిపించిందంటూ?

మెగా ప్రిన్సెస్ వరుణ్ తేజ్, సాక్షి వైద్య కలిసి నటించిన తాజా చిత్రం గాండీవ‌ధారి అర్జున( Gandeevadhari Arjuna )ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానున్న విషయం తెలిసిందే.యాక్షన్ అండ్ ఎమోషనల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.

 I Felt Bad For Agent Failure But No Personal Feelings Says Sakshi Vaidya-TeluguStop.com

ఇకపోతే సినిమా విడుదల తేదీకి మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని మరింత వేగవంతం చేసింది.ఇందులో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ సాక్షి వైద్య అనేక విషయాలను పంచుకుంది.

ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా సాక్షి వైద్య( Sakshi Vaidya ) మాట్లాడుతూ.ఏజెంట్ సినిమా విడుదల కాకముందే కొన్ని షాట్స్ ను దర్శకుడు ప్రవీణ్ చూశారు.ఈ సినిమాకు కొత్త హీరోయిన్ కావాలి అనుకున్నారు.అలా నన్ను ఐరా పాత్రకు సెట్ అవుతానని తీసుకున్నారు అని చెప్పుకొచ్చింది సాక్షి.అనంతరం హీరో వరుణ్ తేజ్ గురించి మాట్లాడుతూ.అతను పెద్ద కుటుంబం నుంచి వచ్చాడు, అందుకని సెట్స్ మీద ఎలా ఉంటాడో అని మొదట్లో భయపడుతూ ఉండేదాన్నీ, కానీ వరుణ్ నన్ను పిలిచి మాట్లాడేవారు.

ఎంతో ఒదిగి ఉండేవారు.

ఈ ప్రయాణంలో నాకు వరుణ్ చాలా సహాయం అని చెప్పుకొచ్చింది సాక్షి.అనంతరం తన మొదటి సినిమా అఖిల్ అక్కినేని( Akhil Akkineni ) తో కలిసి నటించిన ఏజెంట్ ఫ్లాప్ పై స్పందిస్తూ.నాకు పర్సనల్‌గా ఎలాంటి ఫీలింగ్ అనిపించలేదు కానీ, టీం అంత ఎంతో కష్టపడి పని చేసింది, అంత కష్టపడి పని చేసినా ఫెయిల్ అవ్వడం బాధగా అనిపించింది అని చెప్పుకొచ్చింది సాక్షి వైద్య.

ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా సాక్షి వైద్య చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube