సలార్ లో ఇంటర్వెల్ బ్యాంగ్ కోసం అంత ఖర్చు పెట్టారా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోల్లో ప్రభాస్( Prabhas ) ఒకరు.ఈయన ఇప్పటికే చాలా సినిమాల్లో హీరోగా నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

 Huge Budget For Prabhas Salaar Movie Interval Fight Details, Prabhas, Huge Budge-TeluguStop.com

ఆయన చేసిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ప్రస్తుతం ఇప్పుడు కన్నడ డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు ఈ సినిమాలో ఆయన చేసిన ప్రతి సీను కూడా హైలెట్ గా ఉంటుందని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Director Prasanth Neel ) ఇప్పటికే చెప్పడం జరిగింది.అయితే ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం అద్భుతంగా ఉంటుందని చాలామంది చెప్తూ ఉన్నారు.

అయితే ఆ ఒక్క ఇంటర్ వెల్ బ్యాంగ్ కోసమే దాదాపుగా పది కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినట్టుగా తెలుస్తుంది.దాదాపు 20 రోజుల పాటు ఆ ఫైట్ ని షూట్ చేసినట్టుగా తెలుస్తుంది ఆ ఫైట్ ఈ సినిమాకి చాలా కీలకంగా మారనుంది కూడా తెలుస్తుంది.అలాగే ఈ సినిమా మొత్తంలో అది చాలా హైలైట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంట…ఇక భారీ అంచనాల మధ్య షూటింగ్ జరుపుకుంటున్న సలార్ సినిమా( Salaar ) మీద సగటు ప్రేక్షకుడికి చాలా మంచి ఒపీనియన్ ఉంది.

 Huge Budget For Prabhas Salaar Movie Interval Fight Details, Prabhas, Huge Budge-TeluguStop.com

ఈ సినిమా ఈ నెలలోనే రిలీజ్ అవ్వాల్సింది కానీ కొన్ని కారణాలవల్ల ఈ సినిమా పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది.ఇక కొత్తగా ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు.దాంతో ఇప్పుడు సలార్ సినిమా మీద కూడా మంచి అంచనాలే ఏర్పడుతున్నాయి.

ఇక ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ సినిమా మీద ఒక రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు.రీసెంట్ గా వచ్చిన ఆదిపురుష్ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో ఈ సినిమా సూపర్ హిట్ కొడుతుందని మంచి అంచనాలే పెట్టుకున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube