గిఫ్ట్ పేలడంతో పెళ్ళింట విషాదం.. పెళ్లి కొడుకు తో సహా మరొకరు దారుణంగా..!

ఇంట్లో పెళ్లి( Marriage ) ఉంటే ఆ సందడే వేరు.జీవితంలో ఒకసారి చేసుకునే పెళ్లి తహతకు తగ్గట్టుగా చేసుకోవాలని అందరూ కోరుకుంటారు.

 Home Theatre Received As Marriage Gift Explodes In Kabirdham,chhattisgarh, Home-TeluguStop.com

పెళ్లికి వచ్చే బంధువులు, స్నేహితులు ఎంతో విలువైన గిఫ్ట్ లను సమర్పిస్తుంటారు.శుభకార్యాలలో గిఫ్ట్ లు ఇవ్వడం అందరిలో సంతోషాన్ని నింపుతుంది.

కానీ ఒక గిఫ్ట్ ఏకంగా పెళ్లి కొడుకు ప్రాణాలను గాలిలో కలిపి పెళ్ళింట తీవ్ర విషాదం నింపింది.పెళ్లి కొడుకు తో పాటు అతని సోదరుడు కూడా మృతి చెందడంతో స్థానికంగా అందరినీ కలచి వేసింది.

వివరాల్లోకెళితే ఛత్తీస్ గడ్ రాష్ట్రం కబీర్ ధామ్ జిల్లా( Kabirdham )లోని చామరి గ్రామనికి చెందిన హేమేంద్ర మేరవి, అంజనా గ్రామానికి చెందిన యువతికి గత శనివారం కుటుంబ పెద్దల మధ్య అంగరంగ వైభవంగా వివాహం జరిగింది.బంధువులతో పాటు స్నేహితులు కూడా వివాహానికి హాజరై రకరకాల బహుమతులు సమర్పించారు.ఇందులో ఒకరు హోమ్ థియేటర్( Hoome Theater ) ను బహుమతిగా ఇవ్వడం జరిగింది.మరుసటి రోజు పెళ్ళికొడుకు హోమ్ థియేటర్ ను ఆన్ చేయగా ఒక్కసారిగా పేలిపోయింది.

పెళ్ళికొడుకు హేమేంద్ర మేరవి( Mahendra Meravi ) అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.ఆ సమయంలో ఇంట్లో ఉన్న పెళ్ళికొడుకు సోదరుడు రాజ్ కుమార్ తో పాటు మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా పెళ్లి కొడుకు సోదరుడు రాజ్ కుమార్ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.

ఈ ప్రమాదంలో గాయపడిన మిగతా ఆరుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన ఘటన స్థలాన్ని పరిశీలించి హోం థియేటర్ ప్రమాదవశాత్తు పేలిందా.ఎవరైనా కావాలని ఇలా చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

అయితే వివాహం జరిగిన మరుసటి రోజే పెళ్లి కుమారుడు( Groom ) తో పాటు అతని సోదరుడు చనిపోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube