టాలీవుడ్ మాస్ హీరో రవితేజ తాజాగా ధమాకా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో, త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 23వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా హీరో రవితేజ మాట్లాడుతూ.
దమాకా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ఈయన కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇలా అందరి గురించి సరదాగా మాట్లాడినటువంటి రవితేజ హీరోయిన్ శ్రీ లీల గురించి కూడా మాట్లాడారు.
శ్రీ లీల హుషారు, టాలెంట్, ఎంతో ఎనర్జీ ఇవన్నీ కలవాల్సిన అమ్మాయి ఈమెకు ఇండస్ట్రీలో ఎంతో మంచి ఫ్యూచర్ ఉందని, వచ్చే ఏడాది ఈ పాటకి ఆమె ఇండస్ట్రీలో వేరే లెవెల్ లో ఉంటుందని అప్పుడు తను నాకు డేట్లు కూడా ఇవ్వడం కష్టమే అంటూ హీరోయిన్ గురించి ప్రశంసలు కురిపించారు.ఇక రవితేజ చెప్పిన విధంగానే ఇండస్ట్రీలో శ్రీ లీల స్టార్ హీరోయిన్ అవ్వడం ఖాయమంటూ అందరూ అభిప్రాయపడుతున్నారు.
కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన శ్రీ లీల తెలుగులో పెళ్లి సందడి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమాలో ఈమె నటన అందానికి డాన్స్ కు ప్రేక్షకులు మైమరిచిపోయారు దీంతో ఈమెకు వరుస సినిమా అవకాశాలు రావడంతో ఇప్పటికే ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారిపోయింది.ప్రస్తుతం ఈమె చేతిలో అరడజనుకు పైగా సినిమాలో ఉన్నాయని చెప్పాలి.ఇక ఈనెల 23వ తేదీ రాబోతున్న ధమాకా సినిమాపై చిత్ర బృందం ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.
ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్ టీజర్ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.మరి ఈ సినిమా ఎలాంటి ప్రేక్షకాదరణ సంపాదించుకుంటుందో తెలియాల్సి ఉంది.