తెలుగు సినీ ప్రేక్షకులకు దగ్గుబాటి రానా( Daggubati Rana ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రానా పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా బాహుబలి.
ఈ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నారు రానా.ఇంకా చెప్పాలంటే కొంతమందికి రానా అంటే గుర్తు పెట్టుకోవచ్చు కానీ బల్లాలదేవ అంటే చాలు ఇట్టే గుర్తు పట్టేస్తారు.
ఇకపోతే రానా హైదరాబాద్ కు చెందిన మిహిక బజాజ్( Miheeka Bajaj ) అనే అమ్మాయిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.వీరి వివాహం జరిగే కూడా దాదాపు మూడు సంవత్సరాలు కావస్తోంది.
కాగా మిహిక ఇంటీరియర్ డిజైనర్( Interior Designer ) అన్న సంగతి తెలిసిందే.అలాగే ఇంటీరియర్ కి సంబంధించిన సొంత కంపెనీ కూడా ఉంది.ఇది ఇలా ఉంటే తాజాగా మిహిక పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది.అందుకు గల కారణం లేకపోలేదు.ఎప్పుడు సినిమా వాళ్ళ పిక్స్ ని మాత్రమే తమ మ్యాగజైన్ ముఖ చిత్రంగా ముద్రించే హలో మ్యాగజైన్ తమ కవర్ పిక్ మీద తాజాగా దగ్గుబాటి రానా సతీమణి మిహిక బజాజ్( Rana Wife Miheeka ) పిక్ ని ప్రచురించింది.ఆ పిక్ ని చూసిన వాళ్ళందరూ ఇప్పడొస్తున్న హీరోయిన్ లకి ఏ మాత్రం తీసిపోని అందంతో మిహిక ఉందని పొగుడుతున్నారు.
మొదట ఆమె ఫోటోని చూసిన చాలామంది ఎవరు ఈ అందగత్తె అని అనుకున్నారు.
ఆ తర్వాత ఆమె రానా భార్య మిహిక అని తెలియడంతో హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదుగా అని కామెంట్ చేస్తున్నారు.ఫ్లోరెల్ లెహంగాతో పాటు ఆరంజ్ కలర్ శారీ( Miheeka Bajaj Latest Pics )లో మిహిక ఎంతో అందంగా ఉంది.చాలామంది ఆమెకు హీరోయిన్గా ట్రై చేయొచ్చు కదా అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు.
ఇంకొందరు దగ్గుబాటి అభిమానులు మిహిక కనుక సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తే హీరోయిన్ గా రాణించడం మాత్రం పక్కా అని అంటున్నారు.