Naveen Polishetty: నవీన్ పోలిశెట్టి అరడజన్ కొత్త ప్రాజెక్ట్స్..కొత్త టీవీ షో కూడా.!

నవీన్ పొలిశెట్టి( Naveen Polishetty ) మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా విజయంతో హ్యాట్రిక్ హీరోగా మారి ఫుల్ జోష్ మీద ఉన్నాడు.ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ, జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలు విజయం సాధించడంతో టాలీవుడ్ మోస్ట్ ఫేమస్ హీరోగా మారిపోయాడు నవీన్.

 Hero Naveen Polishetty Upcoming Projects In Tollywood-TeluguStop.com

మొదట్లో యూట్యూబ్ వీడియోలు చేసి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఇప్పుడు హ్యాట్రిక్ హీరో రేంజ్ లో ఎదగడం అంటే నవీన్ ఏ స్థాయిలో కష్టపడి ఉంటాడు మనం అర్థం చేసుకోవచ్చు.నవీన్ పోలిశెట్టి లాంటి హీరో ఉంటే ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అని ప్రస్తుతం ప్రేక్షకులంతా కూడా నమ్ముతున్నారు.

ఆ విధంగానే ఆయన తీస్తున్న వరుస కామెడీ సినిమాలన్నీ కూడా హిట్స్ కొడుతున్నాయి.

Telugu Jathi Ratnalu-Movie

ఇక నవీన్ మళ్లీ ఏ సినిమాతో రాబోతున్నాడు అని ప్రేక్షకులంతా కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.అందుకోసం నవీన్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి( Miss Shetty Mr Polishetty ) సినిమా సక్సెస్ మీట్ అరేంజ్ చేసి తన తదుపరి సినిమాల గురించి, ప్లాన్స్ గురించి మాట్లాడాడు.ఒక సినిమా విజయం సాధించింది అంటే హీరోగా అది నాకు బాధ్యతను పెంచినట్టుగానే నేను భావిస్తాను.

ఇప్పుడు మూడు సినిమాలను ఒప్పుకున్నాను.అన్ని స్క్రిప్ట్స్ కూడా లాక్ చేయబడ్డాయి.

వచ్చే ఏడాది ఆ సినిమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా సెట్స్ మీదికి వెళ్ళబోతున్నాయి.వాటికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మీకు నేనే చెబుతాను.

అంతే కాకుండా హిందీలో కూడా కొన్ని కథలు వింటున్నాను.కానీ నా మొదటి ప్రాధాన్యత మాత్రం తెలుగు సినిమాలకే( Telugu Movies ) అని అనుకుంటున్నాను.

Telugu Jathi Ratnalu-Movie

హిందీలో వస్తున్న కపిల్ కామెడీ షో లాంటిది ఒకటి ప్రారంభించాలనే ఆసక్తి కూడా నాలో ఉంది.కానీ టైం సరిపోవడం లేదు.కుదిరితే అన్ని సరిగ్గా ప్లాన్ చేస్తాను అని నవీన్ తెలిపాడు.ఇక ఇదే కాకుండా ఇప్పటికే అనగనగా ఒక రాజు( Anaganaga Oka Raju Movie ) అనే సినిమా అనౌన్స్ చేసిన సంగతి కూడా మనకు తెలిసిందే.మైత్రి మూవీ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ విధంగా చూసుకుంటే దాదాపు అరడజన్ సినిమాలతో ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి చాలా బిజీగా ఉన్నాడు.

ఇవన్నీ కూడా కామెడీ, హ్యూమర్ బేస్ చేసుకుని ఉండబోతున్నాయని వార్త టాలీవుడ్ లో వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube