కార్తీ `ఖైదీ` చిత్రం ఇప్పుడు రష్యాలో ‘ఉస్నిక్’ పేరుతో గ్రాండ్‌గా విడుదల కానుంది

ఒక సినిమా ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకోవడం చాలా అరుదు.2019లో కార్తీ న‌టించిన తమిళ సినిమా `ఖైదీ` ఈ అరుదైన ఘ‌న‌త‌ను చోటు చేసుకుంది.అక్టోబర్ 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించి బాక్సీఫీస్ వ‌ద్ద క్రేజ్ సంపాదించుకుంది.

 Hero Karthi Kaidhi Movie Releasing In Russia Details, Hero Karthi, Director Loke-TeluguStop.com

తొలి సినిమా నుంచి ప్ర‌తిష్టాత్మ‌క‌మైన చిత్రాలను నిర్మిస్తున్న డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్ ఖైదీ చిత్రాన్ని నిర్మించింది.

ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు.కార్తీ ప్రధాన పాత్రలో నరేన్, అర్జున్ దాస్, బేబీ మోనికా త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల‌లో నటించారు.

ఇండియాలో ఒక స్టార్ హీరో న‌టించిన చిత్రంలో హీరోయిన్‌, పాట‌లు వుండ‌డం స‌హ‌జం.కానీ ఖైదీ చిత్రం ఆవిష‌యాన్ని బ్రేక్ చేసింది.హీరోయిన్ లేదు.పాటలూ లేవు.

ఇలాంటి విభిన్న‌మైన ఖైదీ చిత్రం హీరో కార్తీ కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది.తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ వంటి దక్షిణ భారత భాషలన్నింటిలోనూ ‘ఖైదీ’ ట్రెమండ‌స్ రెస్పాన్స్ సంపాదించుకుంది.

తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో మంచి ఆదరణ పొందింది.

Telugu Dream Warrior, Karthi, Kaidhi, Kaidhi Russia, Karthi Kaidhi, Usnik-Movie

ప్రస్తుతం, ఈ చిత్రం హిందీ రీమేక్, ‘భోలా’ పేరుతో నిర్మాణంలో ఉంది, ఇందులో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.‘భోలా’ చిత్రాన్ని డ్రీమ్ వారియర్, రిలయన్స్, డి-సిరీస్ మరియు అజయ్ దేవగన్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇప్పుడు రష్యాలో భారీ ఎత్తున విడుదలవుతున్న `ఖైదీ` మరో మైలురాయిని సృష్టించనుంది.

‘ఉస్నిక్’ పేరుతో దాదాపు 121 నగరాల్లో 297 థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుంది.రష్యాలో ఇంత భారీ స్థాయిలో విడుదలవుతున్న తొలి తమిళ చిత్రం ఇదే కావడం గమనార్హం.దీని కోసం వివిధ ప్రచార కార్యక్రమాలు మరియు ఈవెంట్‌ల‌ను ప్లాన్ చేశారు.4 సీజన్స్ క్రియేషన్స్ రష్యాలో ‘ఉస్నిక్’ని విడుదల చేస్తోంది.

ఇంతకుముందు 100 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిన తమ చిత్రం `ఖైదీ`’ రష్యాలో భారీ స్థాయిలో విడుదల కానుండటం పట్ల డ్రీమ్ వారియర్ సంతోషంగానూ గర్వంగా ఉంద‌ని పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube