మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) నటించిన భోళా శంకర్ సినిమా( Bhola Shankar ) తాజాగా విడుదల అయి ఊహించని విధంగా డిజాస్టర్ టాక్ ని తెచ్చుకుంది.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది.
దీంతో మొదటి రోజు కలెక్షన్స్ బాగానే ఉన్నాయి అనుకున్న ఈ లోపే రెండో రోజు భారీగా పడిపోయాయి.దీంతో ఈ సినిమా పట్ల మెగా అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.
అయితే ఈ భోళా శంకర్ సినిమా ఫలితాలు ఎన్నో పరిణామాలకు దారితీస్తున్నాయి.ఈ సినిమా రిజల్ట్ పట్ల అభిమానుల ఘోష మాత్రం ఒక రేంజ్ లో ఉందని చెప్పవచ్చు.
ఇప్పుడు అభిమానుల ఘోష, భారం అంతా చిరంజీవి తదుపరి సినిమా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ పై పడింది.కళ్యాణ్ కృష్ణ తో( Director Kalyan Krishna ) చిరంజీవి సినిమా చేయబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపించాయి.ఈ నెలలో ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్లు కూడా రానున్నాయి.ఇంతవరకు బాగానే ఉన్నా కళ్యాణ్ కృష్ణ విషయంలో కూడా అభిమానులు కాస్త టెన్షన్ గానే ఉన్నారని చెప్పవచ్చు.
ఇటీవల కాలంలో కాళ్యణ్ కృష్ణ కూడా పెద్దగా ఫామ్ లో లేడు.కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన సోగ్గాడే చిన్నినాయన సినిమా పర్వాలేదు అనిపించింది.తర్వాత దర్శకత్వం వహించిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా కూడా అంతంత మాత్రంగానే ఉంది.
ఇక నేల టికెట్టు సినిమా అయితే డిజాస్టర్ గా నిలిచింది.చిరు ఇచ్చిన కమిట్ మెంట్లలో భాగంగా ఇప్పుడు తీరుస్తున్నదే తప్ప కొత్తగా కథ నచ్చో కాంబో కుదిరో చేస్తున్నది కాదు.అసలే ఇది మలయాళం బ్రో డాడీ రీమేక్( Bro Daddy ) అనే ప్రచారం విపరీతంగా ఉంది.
దీంతో అభిమానులు మళ్లీ రీమేకా అంటూ తలలు పట్టుకుంటున్నారు.వద్దు బాబోయ్ అంటూ చిరంజీవికి మొర పెట్టుకుంటున్నారు.మరి ఇది నిజంగా రీమేకా కాదా అన్నది తెలియాలి అంటే దర్శకుడు స్పందించేంత వరకు వేచి చూడాల్సిందే మరి.కానీ ఇది పూర్తిగా వేరే సబ్జెక్టని, ప్రసన్న కుమార్ ఫ్రెష్ గా రాసిచ్చారని టీమ్ అంటోంది.నిజాలు తేలాలంటే కొంత టైం పడుతుంది.