నిమ్మ రసం, మిరియాలు ఈ రెండూ విడి విడిగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి అందరికీ తెలుసు.రెండుటిలోనూ బోలెడన్ని పోషకాలు నిండి ఉంటాయి.
నిమ్మలో విటమిన్ సి, విటమిన్ బి, కాల్షియం, పాస్పరస్, మెగ్నీషియం, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు ఉంట కాల్షియం, ఐరన్, పొటాషియం, జింక్, మెగ్నీషియం, విటమిన్ ఎ, విటమిన్ సి, కెరోటిన్స్, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మిరియాల్లో పుష్కలంగా ఉంటాయి.
అందుకే ఈ రెండూ ఎన్నో అనారోగ్య సమస్యలను నివారిస్తాయి.
అయితే ఈ రెండు విడి విడిగానే కాదు కలిపి తీసుకున్నా ఎన్నో జబ్బులను దూరం చేసుకోవచ్చు.మరి నిమ్మ రసం, మిరియాలు కలిపి ఎలా తీసుకోవాలి అలా తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటీ అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిని తీసుకుని అందులో రెండు స్పూన్ల నిమ్మ రసం, పావు స్పూన్ మిరియాల పొడి మరియు చిటికెడు ఉప్పు వేసి బాగా కలుపి సేవించాలి.
సాధారణంగా చాలా మంది అజీర్తి, గ్యాస్, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలతో బాధ పడుతూ ఉంటాయి.అయితే నిమ్మ రసం, మిరియాలు కలిపిన ఈ వాటర్‌ను ప్రతి రోజు ఉదయాన్నే తీసుకుంట ఇలాంటి జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. జీర్ణ వ్యవస్థ పని తీరు కూడా మెరుగుతుంది.
అలాగే గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్తో ఇబ్బంది పడే వారు ఈ వాటర్‌ను తీసుకుంటే వెంటనే ఉపశమనం పొందుతారు.
అధిక బరువు తగ్గాలి అని ప్రయత్నించే వారు ప్రతి రోజు ఉదయాన్నే ఈ వాటర్‌ను తీసుకుంటే శరీరంలో అదనపు కొవ్వు కరిగిపోతుంది.
దాంతో వెయిట్ లాస్ అవ్వొచ్చు.ఇక ఈ వాటర్‌ను రెగ్యులర్‌గా తీసుకుంటే శరీర రోగ నిరోధక శక్తి కూడా బలపడుతుంది.