కుగ్రామం నుండి వెళ్లిన అతగాడు అమెరికాలో సంపన్నుడు అయ్యాడిలా!

ఇక్కడ ఓ కుగ్రామం నుండి వెళ్లిన ఒక సామాన్యమైన వ్యక్తి దేశంకాని దేశంలో పైగా పెద్దన్న అమెరికా( America )లో అందనంత ఎత్తుకి చేరుకున్నాడు అంటే అది సాధారణ విషయం కాదు.ఎంతో దీక్ష, పట్టుదల ఉంటేగాని అలా ఎదగడం సాధ్యం కాని పని.

 He Went From The Small Village To Become Rich In America , Viral Latest,news V-TeluguStop.com

కాని అతగాడు చేసి చూపించాడు.నేడు ఎంతమందికో ఆదర్శవంతంగా నిలుస్తున్నాడు.

నేడు అమెరికాలో ఉన్న అత్యంత సంపన్నులైన భారతీయులలో ఒకడిగా తన ఉనికిని చాటుకుంటున్నాడు.అతను మరెవరో కాదు… ‘జై చౌదరి’.

ఒక చిన్న గ్రామంలో పుట్టి చెట్ల కింద చదువుకొని, రాత్రిళ్ళు విధి దీపాల కింద చదువుకొని నేడు ఎవరికీ అందనంత ఎత్తుకి చేరుకొని ఎంతోమందికి ఆదర్శమయ్యాడు.ఇంతకీ ఈ జై చౌదరి ఎవరంటే సైబర్‌ సెక్యూరిటీ సంస్థ Zscaler సీఈఓ ఫౌండర్ ఈ ‘జై చౌదరి( Jay Chaudhry ) ఈయన హిమాచల్ ప్రదేశ్‌లోని ఉన్నా జిల్లాలో ఒక చిన్న గ్రామంలో జన్మించారు.ఆ గ్రామానికి సరైన విద్యుత్ సరఫరా లేకపోవడమే కాకుండా.తాగునీటి సమస్యలు కూడా బాగా ఉండేవి.తల్లిదండ్రులు వ్యవసాయం చేసేవారు కాబట్టి సరైన సౌకర్యాలు కూడా లేకపోవడంతో చిన్నతనంలో చెట్ల కింద చదువుకునేవాడు.చదువుకోసం ప్రతిరోజు సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొరుగు గ్రామమైన ధుసరాలోని హైస్కూల్‌కు నడిచి వెళ్ళేవాడు.

ఇక పాఠశాల విద్య పూర్తయిన తరువాత బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఐఐటీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసి, ది యూనివర్శిటీ ఆఫ్ సిన్సినాటిలో ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్ మాస్టర్స్ ప్రోగ్రామ్‌ చదవడానికి అమెరికాకు వెళ్లారు.తరువాత సుమారు ఇరవై సంవత్సరాలు ఐబిఎమ్, యూనిసిస్, ఐక్యూ వంటి పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలలో పెద్ద స్థాయిలో పని చేసారు.కట్ చేస్తే 1996లో జై చౌదరి సైబర్‌ సెక్యూరిటీ సంస్థ( Cyber security company )ను ప్రారంభించాడు.అంతకంటే ముందు ఇతడు కోర్‌హార్బర్, సెక్యూర్ ఐటీ, సైఫర్‌ట్రస్ట్, ఎయిర్‌డిఫెన్స్ వంటి కంపెనీలను కూడా ప్రారంభించారు.2008లో Zscaler స్థాపించారు.ఇది ప్రస్తుతం 2,600 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను కలిగి ఉంది.

ఈ కంపెనీ ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే అమెరికాలోని అత్యంత సంపన్నులైన భారతీయుల జాబితాలో ఒకరుగా నిలిచారు.

Zscaler CEO Jay Chaudhry Success Story

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube