సాధారణంగా మనలో ఎవరన్నా కొంచెం తింగరి పనులు చేస్తే ‘కోతిలాగా ప్రవర్తించకు‘ అని అంటూ వుంటారు.ఎందుకంటే కోతులు అనేవి సహజసిద్ధంగా ఆ విధంగా బిహేవ్ చేస్తుంటాయి కాబట్టి ఇలాంటి నానుడి వచ్చింది.
అయితే అలాంటి కోతులు శ్రమశిక్షణతో మెలగడం ఎపుడైనా చూశారా? అవును, ఇక్కడ వున్న ఫోటోని చూస్తే మనషులే కాదు నోరు లేని మూగజీవాలు సైతం క్రమశిక్షణగా నడుచుకుంటాయి అని మనకి బోధపడుతుంది.
మన హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం కోతుల్ని ఆంజనేయుని ప్రతిరూపంగా భవిస్తూ ఉంటాం.అయితే మనకు బయట కనిపించే కోతులు చాలామటుకు చిలిపి చేష్టలు చేస్తూ ఉంటాయి.అయితే అలాంటి వానరాలు బుద్ధిగా ఓ వరుస క్రమంలో కూర్చొని అల్పాహారం, స్వీట్లు తింటే ఎలాగుంటుంది.
ఇక్కడ కూడా అదే జరిగింది.హనుమాన్ జయంతి( Hanuman jayanti ) సందర్భంగా మహారాష్ట్రలోని అకోలా జిల్లా కోతలి గ్రామంలో ముంగ్సాజీ మహరాజ్ సంస్థాన్ తరపున భక్తులకు అల్పాహారం, స్వీట్లు పెట్టారు.
భక్తులతో పాటు ఇక్కడ కోతులకు( Monkey ) స్టీల్ ప్లేట్లు పెట్టి అందులో స్వీట్లు వడ్డిస్తే.వానరాలు మనుషులకు మల్లె ఓ క్యూలో కూర్చొని బుద్దిగా వాటిని ఆరగించాయి.
కాగా దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియా( Social media )లో తెగ వైరల్ అవుతున్నాయి.సాధారణంగా కోతులు, కొండముచ్చుల్ని చూస్తే జనం భయపడిపోతుంటారు.కానీ ఇక్కడ అలా ఉండదు.ఇక్కడి కోతులు మనుషుల్లో ఎంచక్కా కలిసిపోతాయి.ముంగ్సాజీ మౌలి సంస్థాన్ నిత్యం హనుమాన్ జయంతికి ఈలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది.అందులో భాగంగానే ఈ ఏడాది కూడా కోతలి గ్రామంలో పచ్చని చెట్ల మధ్యలో సుందరమైన అటవీ ప్రాంతంలో ఈ విందు ఏర్పాటు చేయగా కోతులు అక్కడ అతిధులుగా మారి స్థానికులను రంజింపజేశాయి.