100 కిలోమీటర్ల స్పీడుతో దూసుకుపోయాడు.. బైకర్‌కు హెల్మెట్ ఇచ్చి గొప్పమనసు చాటుకున్నాడు!

ఇండియాలో ఎక్కువమంది ట్రాఫిక్ రూల్స్ పాటించరు.అందువల్ల ఇక్కడ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి.

 He Rushed At A Speed Of 100 Km He Gave A Helmet To The Biker And Showed His Grea-TeluguStop.com

ఇక బైక్స్ పై వెళ్లే వారికి ఎక్కువ ముప్పు ఉంటుంది వీరికి కింద పడితే చాలు తీవ్ర గాయాల పాలవుతుంటారు.ఇక హెల్మెట్( Helmet ) లేకపోతే ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంటుంది.

పోలీసులు హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేస్తూ ఎన్ని కఠిన రూల్స్ తీసుకొచ్చినా చాలా మంది నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు.అయితే ఈ క్రమంలోనే ఒక సామాన్యుడు ప్రజల చేత హెల్మెట్ ధరించేలా ప్రోత్సహించేందుకు నడుం బిగించాడు.

బిహార్‌కు చెందిన రాఘవేంద్ర కుమార్( Raghavendra Kumar ) రోడ్లపై హెల్మెట్ లేకుండా రైట్ చేసే బైకర్‌లను ఆపి మరీ ఉచితంగా హెల్మెట్స్ ను అందిస్తున్నాడు.తనను తాను ‘హెల్మెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పిలుచుకుంటూ గొప్ప పని చేస్తున్నాడు.ఇలా చేయడం వల్ల కనీసం ఒక్క ప్రాణాన్ని కాపాడిన చాలు అని అంటున్నాడు రాఘవేంద్ర.హెల్మెట్ ధరిస్తే ఎంత సురక్షితమో చాలా చక్కగా వివరిస్తూ ప్రతి ఒక్కరితో హెల్మెట్ ధరింపజేస్తున్నాడు.

ఈ రియల్ హీరో ఇంటర్నెట్లో సూపర్ పాపులర్ అయ్యాడు.ఇతడు హెల్మెట్లను ఉచితంగా అందించడానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు చాలానే వైరల్ అయ్యాయి.

కాగా రీసెంట్‌గా కుమార్ ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఒక బైకర్ కి హెల్మెట్ ఫ్రీగా ఇచ్చాడు.తర్వాత హెల్మెట్ వల్ల ప్రాణాలు ఎలా కాపాడుకోవచ్చు వివరించాడు.ఈ తతంగమంతా తన కెమెరాలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.ఆ వీడియోకి ” ఈ బైకర్ నా కారు కంటే ఎక్కువ స్పీడ్ తో వెళ్తున్నాడు.100కు పైగానే వేగంతో దూసుకెళ్తున్నాడు.అతడిని నేను నా కారులో షేర్ చేసి పట్టుకోవాల్సి వచ్చింది.

అంత వేగంగా అతడు రైడ్ చేస్తున్నాడు.హెల్మెట్ లేకుండా ప్రయాణించడం ప్రమాదకరమని చెప్పి హెల్మెట్ అందించాను” అని రాఘవేంద్ర రాసుకొచ్చాడు.

కారులో కూర్చున్నప్పుడు కూడా రాఘవేంద్ర హెల్మెట్ ధరించి ఆశ్చర్యపరిచాడు.ఈ వీడియో చూసిన చాలామంది అతనికి హాట్సాఫ్ చెబుతున్నారు.

దీన్ని మీరు కూడా చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube